జీవితంలో ఆనందం, శ్రేయస్సును అందుకునేందుకు వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కొన్ని ప్రత్యేక విషయాలు, నియమాలు ప్రస్తావించారు.దీనిప్రకారం ఇంట్లో వస్తువులను అమర్చేటప్పుడు సరైన దిశను ఎంచుకోవడం అవసరం.
మీరు ఏదైనా వస్తువును తప్పు దిశలో ఉంచినట్లయితే అటువంటి పరిస్థితిలో సమస్యలు చుట్టుమడతాయి.దక్షిణ దిశలో ఏయే వస్తువులను ఉంచాలి? ఏ వస్తువులు ఉంచకూడదనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పితృ దోషం
ఇంటి దక్షిణ దిశలో పూర్వీకులు నివసిస్తారని, ఇక్కడ ఎలాంటి వస్తువులు ఉంచకూడదని చెబుతారు.ఒక్కసారి పిత్ర దోషం అంటూ వస్తే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది.
పూర్వీకులకు కోపవస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు దూరమవుతాయి.పితృ దోషం వల్ల ఇంటి పరోభివృద్ధి కూడా ఆగిపోతుందని, అలాగే కుటుంబంలో అనేక సమస్యలు తలెత్తుతాయని వాస్తుపండితులు చెబుతుంటారు

వంటగది
ఇంటికి దక్షిణ దిశలో వంటగదిని నిర్మించి చాలామంది తప్పు చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది.అంతే కాదు స్టోర్ రూం కూడా ఈ దిశలో ఉండకూడదు.
ఇలా చేయడం వల్ల ఇంట్లో కూడా సమస్యలు తాండవిస్తాయి.ఇంటి వంటగది ఎప్పుడూ తూర్పు దిశలో ఉండాలని చెబుతారు.