ఇటీవల టెక్నాలజీ( Technology ) బాగా పెరిగిపోయింది.మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ యాప్‌ల ద్వారా మన హార్ట్ బీట్, బీపీ లెవల్స్, వేడి శాతం వంటి వాటిని తెలుసుకోవచ్చు.మన శరీరంలోని వేడి శాతాన్ని అంచనా వేసి జ్వరాన్ని గుర్తించే యాప్స్ కూడా చాలా వచ్చాయి.
అయితే తాజాగా పిల్లల కళ్లను సంరక్షించే యాప్స్ కూడా వచ్చాయి.ఇటీవల చిన్నపిల్లలు కూడా దృష్టి లోపంతో బాధపడుతున్నారు.
కంటి సమస్యలు ఎక్కువ కావడం వల్ల చిన్న వయస్సులోనే కళ్లజోడు లాంటివి ఉపయోగిస్తున్నారు.

అయితే పిల్లల కంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్( Google Play Store ) లో కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.వీటిని ఉపయోగించుకుని కంటి దృష్టిని మెరుగుపర్చుకోవచ్చు.ఈ యాప్స్ లలో కొన్ని టిప్స్ తో పాటు కంటి వ్యామాయాలు ఉంటాయి.
అలాంటి యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఐ ఎక్సర్‌సైజెస్ అనే యాప్ లో బ్లింక్ ఎక్సర్‌సైజ్, అబ్జెక్ట్ ట్రాకింగ్, స్కేలింగ్ ఆబ్జెక్ట్, పామ్ ఎక్సర్‌సైజ్ లాంటివి ఉంటాయి.వీటి వల్ల పొడిబారిన కళ్లు, లేజీ ఐస్ వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.ఇక విజన్( Vision ) అనే మరో యాప్ ద్వారా కంటి కండరాలను కాపాడుకోవచ్చు.
ఇందులో కంటి కండరాలను బలంగా ఉంచుకోవడానికి కావాల్సిన కొన్ని వ్యామాయాలు, యోగా లాంటివి ఉంటాయి.ఇవి పాటించడం వల్ల దృష్టి లోపం తగ్గిపోతుంది.ఇక ఐఎస్‌ఎక్స్ అనే మరో యాప్ కూడా అందుబాటులో ఉంది.ఇందులో కూడా గేమింగ్ ఎక్కువ ఆడేవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలి? విద్యార్థులు అయితే ఎలాంటి వ్యామాయాలు చేయాలి? అనేవి ఉంటాయి.ఇక విజన్ టెస్ట్స్ అనే ఒక ఫ్రీ యాప్ కూడా ఉంది.ఇందులో కంటి దృష్టిని పరీక్షించుకోవడంతో పాటు మెరుగుపర్చుకోవడానికి సూచనలను పొందవచ్చు.చిన్న వయస్సులోనే దృష్టి లోపం రాకుండా ఈ యాప్స్ ద్వాారా రక్షించుకోవచ్చు.







