సాధారణంగా పోషకాహా నిపుణులు తక్కువ కొవ్వు ఉండే ఆహారాలను తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ ఉంటే మంచిదని సలహా ఇస్తూ ఉంటారు.అయితే శరీరానికి కొంత కొవ్వు అవసరం అవుతుంది.
ఆ కొవ్వు కీళ్లు,ఎముకలు తేలికగా మూవ్ మెంట్ ఉండటానికి సహాయపడుతుంది.కాబట్టి శరీరానికి అవసరమైన కొవ్వును తీసుకుంటూ, అధిక కొవ్వును నివారించుకోవడానికి ఈ ఆహారాలను తీసుకోవాలి.
అల్లం
ప్రతి ఇంటిలో అల్లంను రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం.అల్లం కొవ్వును కరిగించటంలో బాగా సహాయపడుతుంది.
ప్రతి రోజు టీలో ఒక స్పూన్ అల్లం రసం వేసుకొని త్రాగితే సరిపోతుంది.అప్పుడు శరీరం పటుత్వం కోల్పోకుండా దృడంగా ఉంటుంది.
గోధుమ గడ్డి
గోధుమ గడ్డిలో ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్,పీచు పదార్ధం సమృద్ధిగా ఉంటుంది.గోదుమ గడ్డిని జ్యుస్ చేసుకొని త్రాగాలి.గోదుమగడ్డిని ఇంటిలో కూడా పెంచుకోవచ్చు.
మిరప కారం
ఇది జీర్ణక్రియను బాగా వేగవంతం చేస్తుంది.కొవ్వును కరిగించటంలో బాగా సహాయపడుతుంది.అయితే మితంగా తీసుకోవాలి.
చేదు ఆరెంజ్
ఇది నిమ్మ జాతి పండు.ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిస్తుంది.గుండె సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.అందువల్ల ప్రతి రోజు రెండు కప్పుల గ్రీన్ టీని త్రాగితే అదనపు కేలరీలు కరిగిపోయి శరీరం పట్టుత్వంతో ఫిట్ గా ఉంటుంది.