డిసెంబర్ 13వ తేదీ నుంచి.. ఈ పుణ్యక్షేత్ర టికెట్లు ఆన్ లైన్ లో..!

మన దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎంతో భక్తి భావంతో శ్రీరాముల వారిని పూజిస్తారు.

అలాగే భద్రాచలంలో( Bhadrachalam ) గోదావరి నది తీరాన వెలసిన రాములవారి దేవాలయానికి( Sri Rama Temple ) ఎంతో విశిష్టత ఉంది.

మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈ దేవాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండి భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు.

ఈ దేవాలయాన్ని రామదాసు నిర్మించాడని పండితులు చెబుతున్నారు.అయితే ఈ దేవాలయం పై ఉన్న సుదర్శన చక్రం మానవ నిర్మితం కాదని, అది దేవత నిర్మితమైనదని పురాణాలలో ఉంది.

"""/" / అలాంటి ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు.

అంతే కాకుండా ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీరామ చంద్ర స్వామి దేవాలయంలో డిసెంబర్ 23వ తేదీన భక్తులకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయా ఈవో రమాదేవి( EO Ramadevi ) తెలిపారు.

ఆలాగే డిసెంబర్ 13వ తేదీ నుంచి ఉత్తర ద్వార దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో( Online Tickets ) అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ముఖ్యంగా చెప్పాలంటే భద్రాద్రి దేవాలయ వెబ్ సైట్ లో టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే భక్తులకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం కోసం రెండు వేల,ఐదు వందల,రెండు వందల యాభై రూపాయల విలువ గల సెక్టార్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఈవో వెల్లడించారు.

ఈ టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా శ్రీరామ చంద్రస్వామిని త్వరగా దర్శించుకునే సౌభాగ్యం లభిస్తుందని దేవాలయ అధికారులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని ఆలయ ఈవో యల్.రమాదేవి వెల్లడించారు.

ఫ్యామిలీతో అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!