ఆ కంచుకోటల్లో ఈసారైనా బోణీ కొడతారా ?

వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ), ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన, బిజెపి,( TDP, Janasena, BJP ) కూటమి చేయని ప్రయత్నం అంటూ లేదు.వినూత్నంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాయి.

 Will You Beat Boni In Those Dungeons, Ysrcp,tdp, Janasena, Bjp, Janasenani, Ap G-TeluguStop.com

ప్రతి పార్టీ గెలుపు ధీమాతోనే ఉంది.టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడిగా ఎన్నికలకు వస్తుండడంతో వారిపై పైచేయి సాధించి గతం కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుని మరోసారి అధికార పీఠంపై కూర్చోవాలనే పట్టుదలతో వైసిపి ఉంది .175 స్థానాల్లోనూ గెలుస్తామనే ధీమాతో దేమాతో వైసిపి ఉండగా, టిడిపి ,జనసేన బిజెపి, కూటమి సైతం అంతకంటే ఎక్కువ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.అయితే కొన్ని నియోజకవర్గాల విషయంలో అటు వైసిపి, టిడిపి ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే అన్నట్టుగా కనిపిస్తున్నాయి.

దీనికి కారణం కొన్ని నియోజకవర్గాలు మొదటి నుంచి ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉండడమే కారణం.సంక్షేమ పథకాలు ప్రజలకు పెద్ద ఎత్తున అందేలా చేసినా ,అభ్యర్థులను మార్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నియోజకవర్గాల్లో మాత్రం ఇతర పార్టీలకు అవకాశం దొరకడం లేదు.

అక్కడ గెలిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.దశాబ్దాలుగా ప్రయోజనం కనిపించడం లేదు.

ముఖ్యంగా టిడిపి, వైసిపి లు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఏపీలో కొన్ని నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగా ఉండగా, మరికొన్ని నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటలుగా మారాయి.

ఇక్కడ వేరొకరికి అవకాశం దొరకాఫ్డం లేదు.అయితే ఈసారి ఆ ఆనవాయితీ మారుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగుదేశం పార్టీకి పూతలపట్టు, రంపచోడవరం, రాజాం, శ్రీశైలం, నెల్లూరు రూరల్, పులివెందుల నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి.ఇక  టిడిపి ఆవిర్భావం తరువాత ఒకే ఒకసారి అంటే పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో  విజయవాడ పశ్చిమ ,కోడుమూరు లలో విజయం దక్కింది.

Telugu Ap, Janasena, Janasenani, Pulivendula, Rajam, Boni, Ysrcp-Politics

ప్రస్తుతం విజయవాడ పశ్చిమలో( Vijayawada West ) బిజెపి పోటీ చేస్తుంది.రాజాం నియోజకవర్గం లో అభ్యర్థులను మార్చినా ఫలితం కనిపించడం లేదు.నెల్లూరు టౌన్ లో గెలుస్తామనే ధీమా కనిపిస్తోంది.యర్రగొండపాలెం లోను అభ్యర్థులను అదేవిధంగా మారుస్తూనే వస్తున్నాయి.వైసిపి విషయానికి వస్తే … ఇప్పటివరకు వైసీపీ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో పోటీ చేసింది రెండు నియోజకవర్గాల్లో మాత్రమే.2014 – 19 ఎన్నికల్లో మాత్రమే వైసిపి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది.ఈ రెండు ఎన్నికల్లోను కొన్ని నియోజకవర్గాల్లో వైసిపి ఓటమిని చవి చూసింది.జగన్ గాలి ఎంత వీచినా కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికీ టిడిపికి కంచుకోటలుగానే మారిపోయాయి.ఇక్కడడ గెలిచేందుకు వైసిపి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా.రెండు సార్లు పరాభవమే ఎదురైంది.

Telugu Ap, Janasena, Janasenani, Pulivendula, Rajam, Boni, Ysrcp-Politics

.అయితే ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో ఆ సెంటిమెంటును మారుస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.టెక్కిలి, హిందూపురంలోనూ( Tekkili , Hindupuram ) ఇదే పరిస్థితి ఉంది.ఇక చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.ఇక్కడ వైసిపి ఇప్పటివరకు గెలవలేదు.ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోనూ, పర్చూరు నియోజకవర్గంలోనూ వైసిపి ఖాతా తెరవలేకపోయింది .గన్నవరం నియోజకవర్గ పరిస్థితి ఇంతే.ఇచ్చాపురం, పెద్దాపురం, పాలకొల్లు, ఉండి గుంటూరు, పశ్చిమ నియోజకవర్గం, కొండేపి, రేపల్లె, విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ వైసీపీ బోణీ చేయలేకపోతోంది.

ఇక్కడ ఎంతమంది అభ్యర్థులను మార్చిన పరిస్థితి మాత్రం మారడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube