వాట్సాప్ మెసేజ్లను టైప్ చేయకుండా ఎలా పంపించాలంటే..?!

ఈ కాలంలో ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కనిపిస్తూనే ఉంది.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడే యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ అనడంలో అతిశయోక్తి లేదు.

 How To Send Whatsapp Messages Without Typing  Whatsup , Messageing Application,-TeluguStop.com

చాటింగ్ చేయడానికి ఈ వాట్సాప్ ఎంతగానో సహకరిస్తుంది.అయితే మీరు వాట్సాప్ లో నిరంతరం చాట్ చేస్తూనే ఉంటారా ? అయితే మీకోసం ఒక అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది.వాట్సాప్ చాటింగ్ చేసేటప్పుడు మెసేజ్ టైప్ చేసి చేతి వేళ్ళు నొప్పులు పుట్టకుండా ఉండాలంటే ఈ అప్షన్ గురించి మీరు తప్పకుండా తెలుసుకుని తీరాలి.అది ఏంటంటే.

ఇకమీదట మీరు ప్రతి మెసేజ్ ను టైప్ చేసి వాట్సాప్ ద్వారా సెండ్ చేయాలిసిన అవసరం లేదు.మీ ఫోన్ లో ఉండే డిజిటల్ అసిస్టెంట్‌ ను ఉపయోగించుకుంటే చాలు.

అదే మీరు ఏ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో దానిని టైప్ చేసి సెండ్ చేస్తుంది.ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే.

వాట్సప్ మెసేజెస్ సెండ్ చేయడం మాత్రమే కాకుండా, వాట్సప్‌ లో వచ్చిన మెసేజెస్ చదివి వినిపించుకోవచ్చు కూడా.దీనికోసం మీరు మీ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మారిస్తే చాలు.

మరి ఆ సెట్టింగ్స్ ఏంటి.? ఎలా టైప్ చేయకుండా వాట్సప్‌ లో మెసేజెస్ సెండ్ చేయాలో చూద్దాం.

Telugu Message, Privachy Policy, Apps, Whatsup-Latest News - Telugu

మీ స్మార్ట్‌ ఫోన్‌ లో ఉన్న ప్లేస్టోర్ నుండి గూగుల్ అసిస్టెంట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి.యాప్ డౌన్లోడ్ చేసిన తరువాత హే గూగుల్ అని లేదంటే ఓకే గూగుల్ అని కమాండ్ ఇవ్వండి.అలా కాకుండా మీ స్మార్ట్‌ ఫోన్‌ లో ఉండే హోమ్ బటన్‌ ను గట్టిగా ప్రెస్ చేస్తే చాలు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది.అప్పుడు మీరు ‘ సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ ‘ అని గట్టిగా చెప్పండి.

అలాగే ఎవరికీ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారో అంటే మీ ఫోన్ లో ఆ నెంబర్ కి ఏ పేరు అయితే సేవ్ చేసారో ఆ పేరు మాత్రమే చెప్పాలిసి ఉంటుంది.పేరు చెప్పిన తరువాత మీరు ఏ మెసేజ్ పంపాలని అనుకుంటున్నారో అని గూగుల్ అసిస్టెంట్ అడుగుతుంది.

Telugu Message, Privachy Policy, Apps, Whatsup-Latest News - Telugu

మీరు ఏ మెసేజ్ అయితే పంపాలని అనుకుంటున్నారో ఆ మెసేజ్ ను చెప్పండి.అంతే ఆ మెసేజ్ మీ ఫోన్ లో ఆటోమెటిక్‌ గా టైప్ అయిపోతుంది.అది కంప్లీట్ అయిన తరువాత మెసేజ్ పంపడానికి రెడీనేనా అని గూగుల్ అసిస్టెంట్ అడుగుతుంది.మీరు అప్పుడుఓకే సెండ్ ఇట్ అనే ఒక మాట చెబితే చాలు ఆటోమేటిక్ గా మీరు పంపాలి అనుకుంటున్న వాళ్ళకి మెసేజ్ వెళ్లిపోతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్ళు గూగుల్ అసిస్టెంట్‌ ను, యాపిల్ ఫోన్ వాడే వాళ్ళు సిరిని ఉపయోగించాలి.ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏ ఫీచర్ అనేది ప్రైవసీగా మెసేజ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడదు.

ఎందుకంటే మీరు చెప్పాలి అనుకున్న మెసేజ్ బయట వాళ్ళకి కూడా వినిపించే అవకాశం ఉంది.కాబట్టి ప్రైవసీ కావాలని అనుకునేవారికి ఈ ఫీచర్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది.

ఎవరూ లేనప్పుడు ఈ ఫీచర్ ఉపయోగించుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube