బాలివుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ తెలుసా? తెలిసే అవకాశం తక్కువే లేండి.ఎందుకంటే తను ఖాన్ త్రయంతో హీరోయిన్ గా ఆడిపాడలేదు.
పాపులర్ సినిమాల గురించి చెప్పుకోవాలంటే ధనుష్ హిందీలో సూపర్ హిట్ రాంఝనాలో కీలక పాత్ర చేసింది.సల్మాన్ ఖాన్ ప్రేమ రతన్ ధన్ పాయోలో సల్మాన్ చెల్లెలి పాత్రలో, సల్మాన్ తో పోటాపోటిగా నటించింది.
మంచి నటిగా గుర్తింపు పొందిన స్వరా ఈమధ్య “అనార్కలి ఫ్రమ్ ఆరా” అని సినిమాలో వేశ్య పాత్ర పోషిస్తూ, కొన్ని అర్థనగ్న సన్నివేశాలు చేసి వార్తల్లో నానింది.
ఇదిలా ఉంటే ఈవ్ టీజింగ్ గురించి ఇటివలే మాట్లాడుతూ స్వరా తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్ ఇంసిడెంట్ గురించి చెప్పింది.
అదేటంటే ప్రేమ రతన్ ధన్ పాయో సినిమా ప్రమోషన్స్ సమయంలో తను ఓసారి లోకల్ ట్రైన్ లో వెళ్ళాల్సివచ్చిందట.అప్పుడు తనను సినిమా నటిగా గుర్తుపట్టిన ఓ అబ్బాయి, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా తనని పైకి కిందికి చూస్తూ, నిర్భయంగా హస్తప్రయోగం చేసుకోవడం మొదలు పెట్టాడట.
ఓ నిమిషం పాటు తాను చూస్తున్న దృశ్యం నిజమేనా కాదా ఆమెకి అర్థం కాలేదట.విషయం అర్థం అయ్యాక తనకి చాలా భయం వేసిందట.
కాని వేరే ప్రయాణికులకి అతగాడు చేస్తున్న పని గురించి చెప్పి, తనకి తగిన బుద్ధి చెప్పిందట స్వరా.తన దగ్గర ఉన్న గొడుగుతో అతడిని గట్టిగానే కొట్టిందట.
ఇంతమాత్రమే కాదు, ఒక నటిగా బయట అడగుపెట్టినప్పుడు ఎంతమంది కళ్ళు హీరోయిన్స్ ని ఏ దృష్టితో చూస్తాయో తనకి బాగా తెలుసు అని, తనకి కూడా అలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయని చెప్పింది స్వరా.
కామంధులు ఉంటారని తెలుసు కాని, మరీ ఇంత గుడ్డిగా ఉంటారని తెలియదు.
ట్రైన్ లో, పబ్లిక్ గా ఓ హీరోయిన్ వైపు చూస్తూ అలాంటి పని చేయడం నిజంగా దారుణం.ఈవ్ టీజింగ్ లో ఇంతకన్నా నీచం ఉంటుందా? మొదట భయపడింది కాని, వాడిని సొంతంగా కొట్టి, ఇతరులతో కొట్టించడం నిజంగా మంచి పనే.అలాంటివారికి అమ్మాయిలు భయపడకుండా బుద్ధి చెప్పాలి, ఎమంటారు?
.






