నాగార్జున నా భర్త ని కావాలని గెలుకుతున్నాడు అంటూ సందీప్ భార్య జ్యోతి షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 7 ( Bigg Boss Season 7 )స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.సీజన్ 6 కి రేటింగ్స్ విషయం లో ఎంత చెత్తగా వచ్చిందో మన అందరికీ తెలుసు.

 Sandeep's Wife Jyoti's Shocking Comments Saying That Nagarjuna Is Winning My Hus-TeluguStop.com

అందుకే ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారు బిగ్ బాస్ టీం.మొదటి ఎపిసోడ్ నుండే ఉల్టా పల్టా అంటూ నాగార్జున( Nagarjuna ) చేసిన ప్రొమోషన్స్ కి తగ్గట్టుగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మరియు ప్రేక్షకులు ఎవరూ ఊహించని విధంగానే గేమ్ సాగుతుంది.ఇప్పటి వరకు ఆరు వారాలు పూర్తి అయితే, కిరణ్ , షకీలా, దామిని, రతికా మరియు శుభ శ్రీ , ఇలా వరుసగా 5 మంది లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నాయని పావని లేదా శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu Jyoti, Nagarjuna, Sandeeps-Movie

ఇదంతా పక్కన పెడితే హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో మనకి మొదటి నుండి స్ట్రాంగ్ గా అనిపించినా టాప్ 3 లో ఒకరు సందీప్( Sandeep ).ఇతను బయట చాలా యాక్టీవ్ గా ఉంటాడు.అలాగే రీసెంట్ గానే నీతోనే డ్యాన్స్ అనే డ్యాన్స్ ప్రోగ్రాం లో తన భార్య జ్యోతి( Jyoti ) తో కలిసి టైటిల్ ని గెలిచాడు.అదంతా పక్కన పెడితే బయట అంత అగ్రెసివ్ గా ఉండే సందీప్, హౌస్ లో అడుగుపెట్టినప్పుడు మాత్రం చాలా యాక్టింగ్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

అలాగే ప్రతీ వారం నాగార్జున చేతిలో క్లాస్ పీకించుకునే ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ లో సందీప్ కచ్చితంగా ఉంటాడు.సంచాలక్ గా విఫలం అయ్యినప్పుడు నాగార్జున సందీప్ ని అన్న మాటలు అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

Telugu Jyoti, Nagarjuna, Sandeeps-Movie

చెత్త సంచాలక్ , నువ్వు పెద్ద పిస్తా అనుకుంటున్నావా అని నాగార్జున అన్న మాటలకు సందీప్ భార్య జ్యోతి స్పందించింది.ఆమె మాట్లాడుతూ ‘ నాగార్జున ఎంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి అయినప్పటికీ నా భర్త ని అంత మాటలు అనేస్తాడా?, నా భర్త నాకు గొప్ప, అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది.కానీ ఒక్కసారి నాగార్జున గారి బోనులోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలి, ఎన్ని మాటలు అన్నా పడాలి తప్పదు.సందీప్ ని తిట్టిన నాగార్జున గారే మళ్ళీ ఆయనని గ్రేట్ అని పొగిడారు.

ఇండస్ట్రీ అన్న తర్వాత తిట్లు తిట్టుంచుకోవడం సహజమే, భరించాలి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube