కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన ‘గోపాల గోపాల’ సినిమాలోని ‘భజే భాజే.’ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే ఈ పాట సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది.ఇక ఈ పాట గురించిన ఒక ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం అవుతోంది.
‘భజే భాజే.’ ట్యూన్‌ను మొదటగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా కోసం సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ట్యూన్ చేశాడట.
అయితే ఆ ట్యూన్ పూరికి పెద్దగా నచ్చలేదట.దాంతో అదే ట్యూన్‌ను అనూప్ కొన్ని మార్పులతో ‘గోపాల గోపాల’ దర్శకుడు డాలీకి వినిపించడం జరిగింది.
ఆయన వెంటనే ఆ ట్యూన్‌ను వాడేయడం జరిగిందట.
ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే ఒక మంచి సాంగ్ మాత్రం ‘గోపాల గోపాల’కు దక్కిందని ప్రేక్షకులు అంటున్నారు.
గోపాలలోని మూడు సాంగ్స్‌లో ఈ సాంగ్ ది బెస్ట్‌గా నిలుస్తోంది.ఇక ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ నటించిన విషయం తెల్సిందే.







