'ఆచార్య' నిర్మాతకు బయ్యర్ల నుండి ఒత్తిడి

మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‌ ఈనెల చివరి వరకు పూర్తి చేయబోతున్నారు.దర్శకుడు కొరటాల శివ సినిమాకు సంబంధించిన తుది షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేశాడు.

 Chiranjeevi Acharya Movie Release Issue , Acharya ,chiranjeevi, Koratala Shiva ,-TeluguStop.com

ఈనెల 9వ తారీకు నుండి చరణ్‌ వారం రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొంటాడు.ఆయనపై పాట చిత్రీకరణ చేయడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇదే సమయంలో చిరంజీవి పై కూడా బ్యాలన్స్‌ సీన్స్‌ ను షూట్‌ చేసి ఈనెల చివరి వరకు సినిమాకు గుమ్మడి కాయ కొట్టేయాలని భావిస్తున్నారు.అయితే సినిమా షూటింగ్ హడావుడిగా పూర్తి చేసినా కూడా సినిమా విడుదల విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా సినిమా విడుదల విషయంలో పునరాలోచించాలంటూ చిత్ర యూనిట్‌ సభ్యులకు బయ్యర్లు విజ్ఞప్తి చేస్తున్నారట.

మెగాస్టార్‌ చిరంజీవి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ బ్రహ్మరథం పడతారు.

అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్లకు వచ్చే అవకాశం లేదు.అందుకే ఈ సినిమా విడుదల వాయిదా వేయడం మంచిదని వారు చెబుతున్నారు.

సినిమాను మే 13న విడుదల చేసి తీరాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు కొరటాల శివ షూటింగ్‌ ను హడావుడిగా చేస్తున్నారు.చిరంజీవి నిర్ణయంపై ఆధారపడి సినిమా విడుదల విషయం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మరో రెండు మూడు వారాల్లో కరోనా కేసులు మరింతగా పెరుగుతాయని రోజుకు రెండు లక్షలు చేరే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు అవసరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది.ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేయడం అనేది ఆత్మహత్య సదృశ్యం అవుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఆచార్య చివరి నిమిషంలో అయినా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.బయ్యర్లు కోరుకున్న విధంగా వాయిదా ఖాయం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube