నెల్లూరు కోర్టులో చోరీపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.చంద్రబాలు లాగా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోలేదని పేర్కొన్నారు.
నీతిగా, నిజాయితీగా ఉన్నాం కాబట్టే సీబీఐ విచారణ కోరినట్టు స్పష్టం చేశారు.దమ్ముంటే చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.
అయితే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ తో పాటు ఇతర వస్తువులు అపహరణకు గురి కావడంపై గతంలో కేసు నమోదైంది.ఈ క్రమంలో హైకోర్టుకు నెల్లూరు న్యాయమూర్తి నివేదిక ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సుమోటోగా కేసు విచారణను స్వీకరించిన న్యాయస్థానం సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.