ఉదయం ఒక కప్పు కాఫీ.మంచి రోజును ఇస్తుంది.
ఉదయం లేవగానే కాఫీ తాగటం వల్ల ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటాము.ఇక రోజులో మనకు బోర్ కొట్టిన.
కప్పు కాఫీతో ఒక మంచి రోజును ఆస్వాదిస్తాం.ఇంకా మనకు రోజులో బద్ధకం అనిపించినా.
నిద్ర వచ్చిన ఒక కప్పు కాఫీ తాగితే మంచి రిలాక్సేషన్ అంది యాక్టీవ్ అవుతాం.
కాఫీ త్రాగటం వలన అనేక లాభాలు ఉన్నాయి.
కానీ లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.కాఫీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కాఫీని త్రాగుతున్నారు.కాఫీలో ఉండే కెఫీన్ అనే పదార్థము కేంద్ర నాడి మండల వ్యవస్థలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
అందుకే కాఫీ త్రాగిన కొంతసేపటికి ఉత్సహంగా ఉన్న భావన కలుగుతుంది.
ఉదయం కాఫీ త్రాగటం వల్ల నిద్ర మత్తు, బద్ధకం పోతుందని అందరు నమ్ముతారు.
కాని ఇది నమ్మకం మాత్రమే ఇంకా దీనికి ఎటువంటి రుజువు లేదు.అయితే మందులతో కలిపి కాఫీ త్రాగటం వల్ల మరో లాభం ఉంది.
ఆ మందులోని భాద నివారణ గుణాన్ని మరింత పెంచుతుంది.కాఫీలోని కెఫీన్ నరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
కాఫీ ఎక్కువ త్రాగటం వలన వణుకుడు, నిద్రలేమి, చికాకు తదితర సమస్యలు వస్తాయి.అయితే ఈ లక్షణాలు అందరిలో కనిపించాలని లేదు కాఫీ త్రాగటం అలవాటు లేని వారు ఒక్కసారిగా రోజులో ఆరు నుంచి ఎనిమిది కప్పుల కాఫీ త్రాగితే పై లక్షణాలు కనబడతాయి.
కాఫీ గుండె పని తీరు పై తీవ్రప్రభావాన్ని చూపుతుంది.
రోజుకు నాలుగు కప్పుల కాఫీ త్రాగేవారిలో కొలెస్ట్రాల్ పెరగటాన్ని కనుగొన్నారు.
ఫిల్టర్ చేసిన కాఫీ త్రాగితే కొంతవరకు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. గర్భవతులు కాఫీ ఎక్కువ త్రాగటం వల్ల గర్భస్రావాలు అయ్యో అవకాశాలు ఉన్నాయి.
కాఫీ అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా మానకుండా క్రమేపి తగ్గించుకోవాలి.అప్పుడే ఎటువంటి ఎఫెక్ట్ పడదు.
చూశారు కదా! కాఫీ వల్ల ఎన్ని లాభాలు, నష్టాలు అనేది.