మనలో సాధించాలనే కసి, పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.ఎలాంటి లోపాలు ఉన్నా మన లక్ష్యాన్ని సులువుగా సాధించడం సాధ్యమవుతుంది.
ఏపీకి చెందిన శ్రీకాంత్ బొల్లా పుట్టుకతోనే అంధుడు కాగా తన లోపాన్ని ధీటుగా ఎదుర్కొని శ్రీకాంత్ బొల్లా ( Srikanth Bolla )పారిశ్రామికవేత్తగా ఎదిగారు.ఏపీలోని మచిలీపట్నంలో( Machilipatnam in AP ) ఉన్న సీతారాపురానికి చెందిన శ్రీకాంత్ బొల్లా 1991లో జన్మించారు.
పుట్టుకతోనే అంధుడు అయిన శ్రీకాంత్ బొల్లా తన లోపాన్ని అధిగమించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.శ్రీకాంత్ తన సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుతూ తాను అంధుడిని కావడం వల్ల ఎవరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదని చెబుతున్నారు.
నిరుపేద ఫ్యామిలీలో( poor family ) పుట్టిన శ్రీకాంత్ సమాజం నుంచి ఎన్నో తిరస్కారాలు ఎదుర్కోవడం జరిగింది.ఆరు సంవత్సరాల వయస్సులోనే శ్రీకాంత్ కిలోమీటర్ల దూరం నడిచి స్కూల్ కు వెళ్లేవారు.
ఎవరి సహాయం లేకుండా స్కూల్ కు నడిచి వెళ్లడం సులువు కాకపోయినా అంధ విద్యార్థులు చదివే బోర్డింగ్ స్కూల్ లో చదువుకుని శ్రీకాంత్ బొల్లా సత్తా చాటారు.ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న శ్రీకాంత్ శబ్దం చేసే బంతితో క్రికెట్ ఆడారు.ఈత కొట్టడం, చెస్, క్రికెట్ నేర్చుకున్న శ్రీకాంత్ ఇంజనీర్ కావాలని కలగన్నారు.ఇంటర్ లో 98 శాతం మార్కులతో శ్రీకాంత్ క్లాస్ టాపర్ గా నిలిచారు.
ఆ తర్వాత మసాచుసెట్స్( Massachusetts ) లో ఎంఐటీని ఎంచుకున్న శ్రీకాంత్ అక్కడ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ సాధించారు.ఇండియాలో బొల్లాంట్ ఇండస్ట్రీస్ ను మొదలుపెట్టిన ఆయన ఈ కంపెనీలో వికలాంగులకు ఉద్యోగాలు ఇచ్చారు.ఈ సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో 36 శాతం వికలాంగులు కావడం గమనార్హం.ఇతని జీవిత చరిత్రతో ఒక సినిమా తెరకెక్కుతోంది.బొల్లా శ్రీకాంత్ టాలెంట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.