కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ తప్పుబట్టారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అద్దంకి తెలిపారు.
వెంకట్ రెడ్డి ప్రతిసారి పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.
కోమటిరెడ్డి కామెంట్స్ పై హైకమాండ్ సీరియస్ గా తీసుకోవాలని కోరారు.గతంలో చర్యలు తీసుకుని ఉంటే ఇలా మాట్లాడే వారు కాదని వెల్లడించారు.
.