అమెరికాలో భారతీయ విద్యార్ధుల హవా.. చైనాను వెనక్కినెట్టి నెంబర్‌వన్‌గా

అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు సంపాదించాలనే ఉద్దేశంతో అగ్రరాజ్యానికి వెళ్లే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.చట్టబద్ధంగా వీలుకానీ పక్షంలో అవసరమైతే దొడ్డిదారిన అయినా సరే అమెరికాలో( America ) అడుగుపెట్టాలని భారతీయులు భావిస్తున్నారు.

 India Becomes Leading Country Of Origin For International Students In United Sta-TeluguStop.com

అక్రమంగా అగ్రరాజ్యంలో ప్రవేశించడం రిస్క్ అని తెలిసినా, పలువురు ప్రాణాలు కోల్పోతున్నా భారతీయలకు డాలర్లపై మోజు పోవడం లేదు.

కాగా.2023-24లలో భారత్ నుంచి మొత్తం 3,31,602 మంది అంతర్జాతీయ విద్యార్ధులు అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చేరినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.ఇది గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 23.3 శాతం మార్పు.ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థలలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో దాదాపు 11,26,690 మంది అంతర్జాతీయ విద్యార్ధులు ఉన్నారట.

Telugu Chinese, Columbia, Ghana, India, Indian, International, Iran-Telugu NRI

2023-24లలో 210కి పైగా దేశాల నుంచి వచ్చిన మొత్తం 1.12 మిలియన్ల మంది అంతర్జాతీయ విద్యార్ధుల జనాభాలో 29 శాతంతో భారతీయులు( Indians ) తొలిస్థానంలో ఉండగా.చైనీయులు( Chinese ) 25 శాతంతో రెండవ స్థానంలో నిలిచారు.

అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్ధులలో భారత్ , చైనా విద్యార్ధుల సంఖ్య 54 శాతం కావడం గమనార్హం.బ్రెజిల్, నైజీరియా, బంగ్లాదేశ్, వియత్నాం, తైవాన్ , కెనడా వంటి దేశాలకు చెందిన వారు అతి తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు.

తర్వాత కొలంబియా (11%), ఘనా (45%), ఇరాన్ (15%), నేపాల్ (11%), నైజీరియా (14%), పాకిస్తాన్ (8%) విద్యార్ధులు ఉన్నారు.అమెరికాలో భారతీయ విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ (1,96,567-19 శాతం), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)ని (97,556-41 శాతం)ని ఎంచుకున్నారు.

Telugu Chinese, Columbia, Ghana, India, Indian, International, Iran-Telugu NRI

మరోవైపు .దొడ్డిదారిన సరిహద్దులు దాటి తమ దేశంలోకి అడుగుపెడుతున్న విదేశీయులపై అమెరికా కన్నెర్ర చేస్తోంది.సరైన పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులను దేశం నుంచి బహిష్కరిస్తోంది.అలా బహిష్కరణను ఎదుర్కొంటున్న వారిలో భారతీయులు కూడా ఉంటున్నారు.గడిచిన ఏడాది కాలంగా 1100 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కి చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube