ఈ లడ్డూను ఒక్కటి తీసుకుంటే చాలు రోజంతా ఫుల్ ఎన‌ర్జిటిక్ గా ఉంటారు!

ఇటీవల కాలంలో రోజు మొత్తం ఎనర్జిటిక్ గా ఉండటం అనేది చాలా మందికి అసాధ్యంగా మారింది.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

 This Laddu Will Keep You Energetic Throughout The Day, Healthy Laddu, Laddu Bene-TeluguStop.com

ఏదేమైనా సరే రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడానికి కొందరు ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు.నిజానికి అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

కానీ ఇప్పుడు చెప్పబోయే లడ్డూను ఒక్కటి తీసుకుంటే చాలు రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.పైగా ఈ ల‌డ్డూ వల్ల ఎన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల వేరుశనగలు( Peanuts ) వేసి బాగా వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న వేరుశ‌న‌గ‌ల‌ను పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తొలగించిన వేరుశనగలు, ఐదు యాల‌కులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి.ఆ తర్వాత మళ్లీ అదే మిక్సీ జార్ లో ఒక కప్పు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ), వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Anemia, Energetic Day, Energy Laddu, Tips, Healthy Laddu, Laddu Benefits,

ఈ ఖర్జూరం మిశ్రమంలో వేరుశెనగ పొడిని వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఒక బాక్స్ లో నింపుకోవాలి.ఈ లడ్డూలను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని రోజుకు ఒకటి చొప్పున తీసుకోవాలి.ఈ లడ్డూలు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి.

Telugu Anemia, Energetic Day, Energy Laddu, Tips, Healthy Laddu, Laddu Benefits,

రెగ్యులర్ గా ఈ లడ్డూలను తీసుకుంటే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రావు.పైగా ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల రక్తహీనత( anemia ) దూరం అవుతుంది.మెదడు ఎంతో చురుగ్గా పని చేస్తుంది.ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతాయి.ఎముకలు దృఢంగా మారతాయి.

మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube