తిరుమలలో నమోదైన మరో కొత్త రికార్డు.. టీటీడీ కీలక నిర్ణయం..

ఇటీవల తిరుమలలో ( Tirumala ) ఒక కొత్త రికార్డు నమోదయింది.తిరుమలలో అతిథి గృహాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చేందుకు ఓ సంస్థ రికార్డు స్థాయిలో చెల్లించింది.

 Another Important Decision By Ttd For Devotees Details, Ttd, Tirumala, Tirumala-TeluguStop.com

అయితే హెచ్ విడిసి లోని 493 అతిథి గృహం నిర్మాణానికి అధికారులు తిరుమలలోని రెవెన్యూ కార్యాలయంలో టెండర్లను నిర్వహించడం జరిగింది.అయితే ఇందులో చెన్నైకు చెందిన జీస్క్వీర్ సంస్థ రూపాయలు 25,77,77,777 ను విరాళంగా చేసింది.

అలాగే ఈ సొమ్ము అంతా నిబంధనల ప్రకారం టీటీడీకి( TTD ) విరాళంగా వెళ్లనుంది.దీంతో ఇది కొత్త రికార్డుగా నమోదయింది.

అయితే ఇదే సమయంలో తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.అయితే తిరుమలలోని వసతి గదిలో అలాగే అతిథి గృహాల నిర్వహణలో టీటీడీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

కొత్త వాటిని నిర్మించడంతోపాటు కొనసాగుతున్న వసతి గృహాల మరమ్మతులు చేపట్టడం జరిగింది.అందులో భాగంగానే ఇప్పుడు వీడిసిలోని 493 అతిథి గృహం నిర్మాణానికి రికార్డు స్థాయిలో విరాళం తిరుమలకు అందింది.

అయితే ఈ అతిథి గృహాన్ని దాత తన సొంత ఖర్చులతో నిర్మించి దేవస్థానంకు అందించాలి.

Telugu Bhakti, Devotional, Square Company, Tirumala, Tirumalaguest-Latest News -

అలాగే ఆ గృహంలో ఒక గదిని దాతకు కేటాయిస్తారు.ఇక కంపెనీ పేరిట టెండర్ ( Tender ) పొందిన దాతలకు 20 ఏళ్లు వ్యక్తిగతంగా టెండర్ పొందిన దాతలకు జీవితాంతం ఆ గది అందుబాటులో ఉంటుంది.ఇక కొద్ది రోజులుగా తిరుమలలో భక్తులకు వసతి గదుల విషయంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

తిరుమల లో మొత్తం 7500 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.అయితే అందులో 50, 100 రూపాయల గదులు 5000 వరకు ఉన్నాయి.అయితే తాజాగా రూపాయలు 120 కోట్లతో ఈ కొత్త గదులను ఆధునికరించారు.

Telugu Bhakti, Devotional, Square Company, Tirumala, Tirumalaguest-Latest News -

వాటిలో ఫ్లోరింగ్ గ్రీజర్లు లాంటివి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది.ఇక పద్మావతి, ఎంపీసీ కార్యాలయాల్లో ప్రముఖులకు కేటాయిస్తారు.గృహాలకు సంబంధించి గదుల ధరలను కూడా ఈ మధ్యకాలంలో పెంచడం జరిగింది.

అదే సమయంలో గదుల నియామకంలో పారదర్శకత కోసం గత మార్చి 1వ తేదీ నుంచి ముఖ గుర్తింపు విధానం అమలు చేస్తున్నారు.

ఇక అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రారంభించిన ముఖ గుర్తింపు ఆధారిత సేవలతో కూడా ప్రజలు లభ్యత గణనీయంగా పెరిగినట్లు టీటీడీ గుర్తించింది.

ఇక టీటీడీ మరో నిర్ణయం కూడా అమలులోకి తీసుకొచ్చింది.అయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల లో టీటీడీ ప్లాస్టిక్ బాటిల్లను నిషేధించడం జరిగింది.

అయితే వారు భక్తులకు రాగి, స్టీల్ నీటి సీసాలను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube