టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా కిరణ్ అబ్బవరం(kiran abbavaram) మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.రాజావారు రాణివారు, sr కళ్యాణమండపం(Rajavaru ranivaru, SR kaḷyaṇamaṇḍapaṁ) సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం తర్వాత సినిమాలతో సైతం క్రేజ్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.“క” సినిమా కిరణ్ అబ్బవరంకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.
తాజాగా క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ మా అమ్మ ఐదో తరగతి వరకు చదువుకుందని కూలి పని చేసేదని తెలిపారు.
అమ్మ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనుభవించిందని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.మమ్మల్ని మంచి చదువులు చదివించాలని కువైట్ కు వెళ్లి కష్టపడి చదివించిందని ఆయన పేర్కొన్నారు.ఇద్దరు కొడుకులు ఏదైనా సాధించిండని అన్నను, నన్ను అమ్మ కోరిందని కిరణ్ అబ్బవరం తెలిపారు.

నా లైఫ్ అంతా హాస్టల్ అని మా నాన్న గురించి నేను sr కళ్యాణమండపం సినిమాలో చెప్పేశానని ఆయన అన్నారు.అమ్మ వల్లే ఈ సక్సెస్ దక్కిందని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు.
బంధువులు నాకు ఎంతో సపోర్ట్ చేశారని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.కూలి పని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు.

ఈరోజు నేను బాధతో మాట్లాడానని ఆయన తెలిపారు.నా కష్టంలో మాత్రం లోపం లేదని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.ఒక సినిమాలో నన్ను కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయని నాపై అంత కోపం ఎందుకని ఆయన ప్రశ్నించారు.కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కిరణ్ అబ్బవరం తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.







