ట్రంప్‌పై హత్యాయత్నం.. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధిపతిపై విమర్శలు, రాజీనామాకు డిమాండ్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) హత్యాయత్నంతో అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది.అత్యంత శక్తివంతమైన , కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలో( America ) ఓ మాజీ అధ్యక్షుడిని చంపే ప్రయత్నం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

 Trump Assassination Attempt: Us Secret Service Chief Faces Calls To Resign Amid-TeluguStop.com

ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్‌పై( Secret Service ) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.యూఎస్ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్( Kimberly Cheatle ) తక్షణం రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఆమె తన విధులు పక్కనపెట్టి.ఇతర పనుల్లో నిమగ్నమైపోయారని మండిపడుతున్నారు.

చీటిల్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీక్రెట్ సర్వీస్ అధిపతిగా నియమించారు.

Telugu Donald Trump, Fbiassistant, Resign, Secret, Secret Failure, Trump Attempt

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.మాజీ ఎఫ్‌బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ క్రిస్ స్వీకర్( Chris Swecker ) మాట్లాడుతూ ట్రంప్‌పై దాడి భద్రతా వైఫల్యం వల్లేనన్నారు.దుండగుడు ఓ పిల్లాడు కాబట్టి సరిపోయింది, అలా కాకుండా ప్రొఫెషనల్ షూటర్ అయ్యుంటే పరిస్ధితి ఎలా ఉండేదోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రంప్‌ను పోడియం నుంచి బయటకు తీసుకురావడానికి 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని స్వీకర్ తెలిపారు.వీఐపీపై దాడి జరగకుండా అడ్డుకోవడం, వీఐపీని డేంజర్ జోన్ నుంచి సెకన్ల వ్యవధిలో తరలించడం సీక్రెట్ సర్వీస్ పని అని ఆయన వెల్లడించారు.

Telugu Donald Trump, Fbiassistant, Resign, Secret, Secret Failure, Trump Attempt

2 నిమిషాల ఆలస్యమనేది చాలా ఎక్కువని, స్పాట్‌లో సెకండ్ షూటర్ ఎవరైనా ఉండి ఉంటే.అతను మిగతా పని పూర్తి చేసేవాడని స్వీకర్ పేర్కొన్నారు.పోడియం కింద దాక్కొన్న ట్రంప్‌ను తిరిగి పైకి లేచి పిడికిలి ఎత్తేవరకు ఉండకూడదన్నారు.ట్రంప్‌ను తరలించే సమయంలో ఆయన తల భాగం కనిపించిందని.పొడవుగా ఉండే మేల్ ఆఫీసర్లు ఆయనకు వెనుక నుంచి రక్షణ కల్పిస్తే, పొట్టిగా ఉన్న ఓ మహిళా అధికారి ముందు ఉండటం ఏంటని స్వీకర్ ప్రశ్నించారు.

మరోవైపు.

ట్రంప్‌పై దాడి జరగడానికి స్థానిక పోలీసుల వైఫల్యమే కారణమని సీక్రెట్ సర్వీస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.నిందితుడు పైకప్పు ఎక్కి.

గన్‌తో పొజిషన్ తీసుకున్నా పట్టించుకోలేదని తెలిపింది.ట్రంప్ ర్యాలీ జరిగిన ఏజీఆర్ ఇంటర్నేషనల్ ఐఎన్‌సీ ఫ్యాక్టరీ గ్రౌండ్స్‌ను పెట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత వారిదేనని సీక్రెట్ సర్వీస్ చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube