ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ఈడీ జారీ చేసిన నోటీసులను కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ( High Court of Delhi ) వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.