ముఖ్యంగా చెప్పాలంటే బుద్ధుడి( Buddha ) గురించి దాదాపు చాలా మందికి తెలుసు.సిద్ధార్థుడిగా పుట్టిన ఓ రాజు బుద్ధుడి గా మారిన కథ చాలా మంది వినే ఉంటారు.
అలాగే చిన్నప్పుడు మీరు ఈ కథను చదువుకొని ఉంటారు.ప్రశాంతతకు మారుపేరు గౌతమ బుద్ధుడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఈ ప్రపంచంలో చాలా మంది ఈ బౌద్ధ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు.ఎవరైతే ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటారో వారు ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు.
జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతి మాట జీవితానికి ఒక పాఠం గా మారింది.అలాగే చాలా మంది బుద్ధుడు చెప్పిన సూక్తులను కూడా పాటిస్తూ ఉన్నారు.
అలాగే తమ ఇళ్లలో కూడా బుద్ధుడికి సంబంధించిన చిత్రపటాలను ఉంచుకుంటూ ఉన్నారు.

అలాంటి బుద్ధుడు చెప్పిన కొన్ని సూత్రాలను( Buddha Sutra ) పాటిస్తే మీ జీవితమే మారిపోతుంది.మరి ఆ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బుద్ధుడు చెప్పిన సూక్తులలో ముఖ్యమైనది జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.
ప్రస్తుత రోజులలో అందరిలోనూ దురాశ, స్వార్థం( Selfish ) అనేవి విపరీతంగా పెరిగిపోయాయి.ఇతరులకు సహాయం చేయడాన్నే మర్చిపోయారు.
అలాగే సమయం అనేది ఎప్పటికీ తిరిగి రానిది.

కాబట్టి మీరు సమయాన్ని ఎట్టి పరిస్థితులలోనూ కూడా వృధా చేయకూడదు.ప్రతిక్షణం ఎంతో విలువైనదని బుద్ధుడు బోధించాడు.ఇంకా చెప్పాలంటే ఎదుటివారి పట్ల సానుభూతి దయతో ఉండాలని బుద్ధుడు తెలిపాడు.
మనిషికి ఉండవలసిన లక్షణాలలో దయా, కరుణ ( Mercy,Compassion )అనేవి కచ్చితంగా ఉండాలి.ఎవరైతే తమ జీవితంలో సానుభూతి దయను కలిగి ఉంటారో వారు జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు.
అలాగే నేను, నాది అన్న అహంకారాన్ని మనిషి దూరం చేసుకోవాలి.అహంకారం వల్ల అనుబంధాలను, స్నేహితులను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది.
అలాగే అహంకారం కోపం పెంచుతుంది.అహంకారం ఉన్నవారు సమాజంలో గౌరవంగా బ్రతకలేరని బుద్ధుడు తెలిపాడు.
అదే విధంగా సుఖాలపై వ్యామోహం అసలు ఉండకూడదు.
DEVOTIONAL