వేర్వేరుగా ప్రమోషన్స్ చేస్తున్న చరణ్ తారక్.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మరికొన్ని గంటల్లో ఆర్ఆర్ఆర్(RRR) మూవీ ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకుంటుందో లేదో స్పష్టత రానుంది.ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అవార్డ్ ఖాయమని ప్రిడిక్షన్స్ సైతం చెబుతున్నారు.

 Reasons Behind Charan Tarak Oscar Differenet Promotions Details Here Goes Vira-TeluguStop.com

రాజమౌళి ప్రమోషన్స్ కోసం చేసిన ఖర్చుకు తగిన ఫలితం దక్కడం ఖాయమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అయితే ఆస్కార్ అవార్డ్ కోసం చరణ్, తారక్(Charan, Tarak) వేర్వేరుగా ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

చరణ్, తారక్ ఫోటోలు వేర్వేరుగా దిగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.అయితే వీళ్లిద్దరూ వేర్వేరుగా ప్రమోషన్స్ చేయడం వెనుక అసలు రీజన్ వేరే ఉందని తెలుస్తోంది.

చరణ్, తారక్ కలిసి ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో ఒక హీరో హైలెట్ అవుతుంటే మరికొన్ని సందర్భాల్లో మరో హీరో హైలెట్ అవుతున్నారు.అదే సమయంలో ఫ్యాన్స్ అవతలి హీరోలను ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ రీజన్ వల్ల చరణ్, తారక్ వేర్వేరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.అయితే చరణ్, తారక్ కలిసి కనిపిస్తేనే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చరణ్, తారక్ పలు సందర్భాల్లో ఒకరినొకరు ప్రశంసించుకున్న సంగతి తెలిసిందే.తారక్, చరణ్ మరిన్ని సినిమాలలో కలిసి నటించడంతో పాటు మరిన్ని సక్సెస్ లను సాధించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే చరణ్, తారక్ కాంబోను మరోసారి చూడవచ్చు.ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి ఇప్పటికే లైన్ సిద్ధమైంది.

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఏ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతుందో చూడాలి.ఈ సినిమాకు దానయ్య (Danayya)నిర్మాతగా వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది.

రాజమౌళి ఈ సినిమాకు వచ్చే అవార్డ్ తో తన స్థాయిని మరింత పెంచుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube