గనిగా కనిపించబోతున్న వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపధ్యంలో ఉన్న కథతో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

 Varun Tej Next Film Title Gani, Boxing, Tollywood, Mega Hero, Pawan Kalyan, Balu-TeluguStop.com

వరుణ్ తేజ్ కెరియర్ లో సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథతో గతంలో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ సినిమా చేశాడు.

అది కూడా బాక్సింగ్ నేపధ్యంలో చేసి సూపర్ హిట్ కొట్టాడు.ఇప్పుడు బాబాయ్ దారిలోనే బాక్సింగ్ కథాంశంతో హిట్ కొట్టడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సిద్ధం అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తూ ఉండగా ఓ కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కనిపించబోతున్నాడు.ఓ విధంగా ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా తెరకేక్కుతుందని చెప్పాలి.

ఇక ఉపేంద్ర సినిమాలో నటిస్తూ ఉండగంతో సౌత్ నాలుగు బాషలలో సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Telugu Balu, Gani, Kiran Korrapati, Pawan Kalyan, Tollywood, Upendra, Varun Tej-

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బాక్సర్ గా వరుణ్ లుక్ ని రివీల్ చేయడంతో పాటు సినిమా టైటిల్ కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర పేరు గని అని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో సినిమా టైటిల్ కూడా గనిగానే ఫిక్స్ చేసారని టాక్ నడుస్తుంది.పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీ బాలులోని పాత్ర పేరు కూడా గని కావడం, పవన్ కళ్యాణ్ తరహాలోనే బాక్సింగ్ నేపధ్యంలో వరుణ్ సినిమా చేయడం యాదృచ్చికంగా జరిగాయని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube