కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై( Pithapuram Constituency ) వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) సమక్షంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరనున్నారు.
ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ( Tadepalli Camp Office )నియోజకవర్గ ఇంఛార్జ్ వంగా గీత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రానున్నారు.కాగా పిఠాపురం స్థానాన్ని ఎంతో ప్రతిష్మాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఇప్పటికే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాలని మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు పలువురు కీలక నేతలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే మండలాల వారీగా నేతలకు సీఎం జగన్ బాధ్యతలను అప్పగించారు.ఇందులో భాగంగా గొల్లప్రోలుకు కన్నబాబు, యు.కొత్తపల్లికి దాడిశెట్టి రాజా, పిఠాపురం టౌన్ కు మిథున్ రెడ్డి ఇంఛార్జ్ లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.