ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది ఆ కంపెనీ.ఈ-కామర్స్ రిటైలర్ వస్తువుల ధరలతో సంబంధం లేకుండా అన్ని క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లకు ఎక్స్‌ట్రా ఫీజు వసూలు చేస్తామని ప్రకటించింది.
దీంతో యూజర్లు ఇప్పటినుంచి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లకు ఎక్స్‌ట్రా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.అయితే, ప్రీపెయిడ్ ఆర్డర్‌లకు మాత్రం ఎలాంటి రుసుమును కంపెనీ వసూలు చేయదు.
సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ విక్రేతను బట్టి డెలివరీ ఛార్జీ తీసుకుంటూ ఉంటుంది.ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌గా జాబితా చేయబడిన వస్తువుల విలువ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఒక్కో వస్తువుకు డెలివరీకి రూ.40 ఛార్జీ ఫ్లిప్‌కార్ట్ వసూలు చేస్తుంది.రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లు ఉచితంగా డెలివరీ చేస్తుంది.ఈ ఫీజులో కంపెనీ ఎలాంటి మార్పు తీసుకురాలేదు.కానీ తాజాగా ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో ఒక్కో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌కు రూ.5 ఛార్జ్ చేస్తుంది.ప్రొడక్ట్ ప్రైస్ రూ.150 లేదా రూ.15,000 ఉన్నా ఈ ఐదు రూపాయలు కస్టమర్లు చెల్లించుకోక తప్పదు.ప్రీపెయిడ్ చేసిన వారు మాత్రం ఈ ఛార్జీ కట్టనక్కర్లేదు.
ఫ్లిప్‌కార్ట్ కంపెనీ తాజాగా ప్రకటిస్తూ ఫలానా ప్రొడక్ట్‌కి డెలివరీ ఫీజు ఉన్నా లేకున్నా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లన్నింటికీ హ్యాండ్లింగ్ ఫీజుగా రూ.5 వసూలు చేస్తామని తెలిపింది.నిర్వహణ ఖర్చుల కారణంగా, ఈ సీఓడీ సెలెక్ట్ చేసే ఆర్డర్‌లకు నామమాత్రంగా రూ.5 ఛార్జ్ చేస్తున్నాం.ఇప్పుడే ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా ఈ రుసుమును నివారించండి” అని ఫ్లిప్‌కార్ట్‌లో క్యాష్-ఆన్-డెలివరీ ఆప్షన్ కింద పేర్కొంది.