రాజకీయాలకు ' బండ్ల'న్న నమస్కారం వెనక పవన్ ?

బండ్ల గణేష్ ! సినీ కమెడియన్ గా ప్రస్థానం ప్రారంభించి , నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఎదిగిన బండ్ల గణేష్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండేవారు.తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా  వ్యవహరించడంతోపాటు,  ఆ పార్టీ కీలక నాయకులందరికి సన్నిహితమైన వ్యక్తిగాను ముద్ర వేయచుకున్నారు.

 Producer Bandla Ganesh Says Good Bye To Politics,pawan Kalyan,bandla Ganesh,jana-TeluguStop.com

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.గణేష్.

  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించినా.గణేష్ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు.2018 తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని గణేష్ ప్రయత్నించినా.  కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో కాస్త అసంతృప్తి చెందారు.

ఆయన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఇక మీడియా ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కామెడీగా మారి గణేష్ ట్రోలింగ్ కి గురవుతూ వచ్చారు.

       ఇదిలా ఉంటే ఆకస్మాత్తుగా సోషల్ మీడియా ద్వారా తాను రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.” నమస్కారం .! నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో , వారి కోరికపై, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, నాకున్న పనుల వల్ల ,నా వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం కానీ,  మిత్రుత్వం కానీ లేదు.” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
   

   అయితే త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో,  బండ్ల గణేష్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయంశం గా మారింది.  గణేష్ నిర్ణయం  వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని,  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన గురించిన చర్చ ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాజకీయాల్లోనూ యాక్టివ్ అవుతామని , రాబోయే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తాము అంటూ పవన్ ప్రకటించారు.అయితే జనసేనలో ప్రత్యక్షంగా గణేష్ చేరకపోయినా.

  వెనకుండి  ఆ పార్టీ కార్యక్రమాలను నడిపించే ప్లాన్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నారని, గణేష్ నిర్ణయం వెనుక పవన్ ఉన్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube