మీ మొహాలను పెట్టి సినిమా తీస్తే కుక్కలు కూడా చూడవు అంటూ ప్రభుదేవాను అవమానించింది ఎవరు..?

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా 1993లో వచ్చిన ‘జెంటిల్‌మేన్‌‘ సినిమా గుర్తుందా.ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు ప్రొడ్యూసర్ కుంజుమన్ కి కనక వర్షం కూడా కురిపించింది.

 Prabhudeva Movie Struggles In His Early Days Of Career And Tragedy Story Behind-TeluguStop.com

ఇండియన్ తోపు డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ దర్శకత్వం వహిస్తే ఏ సినిమా అయినా ఆమాత్రం ఉంటుంది అనేలా ఆయన టేకింగ్, హీరో అర్జున్ నటన, ఎఆర్ రెహమాన్ సంగీతం ఇలా అన్ని బాగా కుదిరాయి.అందులోనూ మరి ముఖ్యంగా ఆ సినిమాలో చికుబుకు రైలే సాంగ్ అయితే అప్పట్లో ఒక ఊపు ఊపింది.

అందులో డాన్స్ చేసిన ఆ వ్యక్తిని చూసి, అతని ఒంట్లో అసలు ఎముకలు ఉన్నాయా? అని అందరూ ఆశ్చర్యపోయారు.అతనే ఆ తర్వాత ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.

అలా జెంటిల్‌మేన్‌ సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత అదే టీం అదే ఊపులో ఇంకొక సినిమా తీయాలని ఫిక్స్ అయింది.ప్రొడ్యూసర్ కుంజుమన్ శంకర్ ని నమ్మి ఆయనకు మొదటి సినిమా జంటిల్ మెన్ సినిమాలో డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడంతో దాన్ని సూపర్ హిట్ చేసాడు.

సో, మనం ఇంకొక సినిమా కూడా కలిసి చేస్తున్నాం.నువ్వు వెంటనే ఒక మంచి కథ రెడీ చేస్కో అంటూ శంకర్ కి మరో అవకాశం ఇచ్చాడట ప్రొడ్యూసర్ కుంజుమన్.

అప్పుడు శంకర్ ఒక మంచి లవ్ స్టోరీ రాసుకొని.కుంజుమన్ కి.వాళ్ళ టీం కి ఆ స్టోరీ లైన్ చెప్పారట.‘మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు ఏకంగా గవర్నర్‌ కుమార్తెను ప్రేమిస్తాడు’ ఇది శంకర్‌ చెప్పిన స్టోరీ లైన్‌.

అందరూ బాగుందని అనుకున్నారు.

Telugu Vadivel, Shankar, Gentleman, Nagma, Prabhudeva, Premikudu, Kunjumon-Lates

ఇక వెంటనే ఆ సినిమాకి ‘ప్రేమికుడు‘ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేసి కథకి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ని కూడా పూర్తి చేసాడు శంకర్.ఇక ప్రొడ్యూసర్ కుంజుమన్‌ ఈసారి కూడా ఈ చిత్రాన్ని భారీగా తీయాలని భావించారు.అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలో తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నారు.

గవర్నర్‌గా చెన్నారెడ్డి పనిచేస్తున్నారు.అయితే వీళ్ళు తీస్తున్న ‘ప్రేమికుడు‘ సినిమాలో హీరోయిన్‌ తండ్రి గవర్నర్ అని అతను కుట్రలు కుతంత్రాలు చేస్తుంటాడని ఇదే సినిమాకి మెయిన్ పార్ట్ అనే విషయం ఆ నోటా ఈనోటా పాకి అది అప్పటి గవర్నర్ కార్యాలయం వరకు చేరింది.

దాంతో గవర్నర్‌ కార్యాలయం నుంచి నిర్మాత కుంజుమన్‌ కి అప్పట్లో బెదిరింపులు కూడా వచ్చాయి.ఆయా సన్నివేశాలను తీసేయమని బెదిరించారు.

Telugu Vadivel, Shankar, Gentleman, Nagma, Prabhudeva, Premikudu, Kunjumon-Lates

అయితే ఇదే విషయం కుంజుమన్‌ సీఎం జయలలితకు వెళ్లి కలిసి చెప్పడంతో.‘అప్పుడు జయలలిత అలాంటి సన్నివేశాలు ఉంటే సెన్సార్‌ బోర్డు వాళ్లు పీకి పక్కనేస్తారు.భయపడాల్సిన పనిలేదు’ మీరు సినిమా చేస్కోండి అంటూ భరోసా ఇచ్చారట.ఆ తర్వాత సినిమాను చూసిన ఆమె చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారట.అయితే కథ మొత్తం సిద్ధమైంది గవర్నమెంట్ నుండి వున్న చిన్న చిన్న ప్రోల్మ్స్ కూడా జయలలిత దయవల్ల తీరిపోయాయి.ఇక ఈ కథకు తగ్గట్టు హీరోని వెతకాలి.

ఎవరైతే బావుంటారు అని ఆలోచిస్తున్న టైం లో ప్రొడ్యూసర్ గారు ఎవరైనా కొత్తవాళ్ళని తీస్కుందాం మన ‘జెంటిల్‌మేన్‌’లో చికుబుకు చికుబుకు రైలే‘ పాటకు ఇరగదీసిన ప్రభుదేవా ని తీసుకుంటే ఎలా ఉంటుంది అంటూ డైరెక్టర్ శంకర్ కి చెబితే శంకర్ ప్రభుదేవాని ఒద్దన్నారట.అతన్ని ఒక 5 నిమిషాల పాటలో ఎవరైనా చూస్తారుగాని రెండున్నర గంటలు అతన్ని చూడలేరు అంటూ అంతగా ఆసక్తి చూపలేదట డైరెక్టర్ శంకర్.

పైగా అప్పటికి ప్రభుదేవా సన్నగా, పీలగా ఉండేవాడు.గుబురు గడ్డంతో అసలు ప్రేమికుడి టైటిల్ కి ప్రభుదేవాకి అసలు సంబంధంమే లేనట్టుగా ఉండేవాడు.

సో, అలాంటి వ్యక్తిని హీరోగా ప్రేక్షకులు హర్షిస్తారా’ అని డైరెక్టర్ దగ్గర నుండి డిస్ట్రిబ్యూటర్స్ వరకు ఎన్నో అనుమానాలు.కానీ ప్రొడ్యూసర్ కుంజుమన్ మాత్రం లేదు బావుంటుంది చూడండి అంటూ ప్రభుదేవాకి ఫిక్స్ చేసి బలవంతంగా శంకర్ ని ఒప్పించి ఇందులో హీరోయిన్ గా నగ్మాని తీసుకున్నాడు.

ఇక వెంటవెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది.సింగపూర్‌కు చెందిన సాంకేతిక నిపుణులు అందరూ ఈ సినిమాకోసం పని చేసారు.అంతేకాదు ఈ సినిమాకి ‘జెంటిల్‌మేన్‌‘ విజయంతో మరోసారి కాక మీద ఉన్న రెహమాన్‌ గారినే తీసుకున్నారు.ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారు.

ఊర్వశి.ఊర్వశి.‘, ‘ముక్కాల ముక్కాబులా‘ పాటలు ఇప్పటికీ ఎంత ఫేమస్సో మనందరికి తెలిసిందే.ఇక హీరో స్నేహితుడిగా గౌండమణిని తీసుకుందామని అనుకుంటే ఆయన బాడ్ లక్ ఆ సినిమాకే ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పాడట.

దాంతో వడివేలు గారిని ఈ సినిమాకి సెలెక్ట్ చేసారు.

Telugu Vadivel, Shankar, Gentleman, Nagma, Prabhudeva, Premikudu, Kunjumon-Lates

అయితే వడివేలుకి అప్పడు టైం బాగోలేక అప్పటివరకు ఆయన నటించిన వరుస సినిమాలు ప్లాప్ గా నిలిచాయట.దాంతో వడివేలును కూడా ఒద్దని డిస్టిబ్యూటర్స్ చెప్తున్నా వినకుండా కుంజుమన్ నిర్ణయం తీసుకున్నారు.ఇక గవర్నర్‌ గా కాకర్ల సత్యనారాయణమూర్తి పాత్రకు గిరీష్‌ కర్నాడ్‌ను ఎంపిక చేసుకొని సినిమా పూర్తి చేసారు.

అలా ఎన్నో ఒడిదుడుకుల మద్య ప్రభుదేవా నటించిన ప్రేమికుడు సినిమా 1994, సెప్టెంబరు 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.ఈ సినిమా అప్పట్లో ఎంత బారి హిట్ అంటే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

దాంతో ఈ సినిమాని డబ్‌ చేసి హిందీలోనూ విడుదల చేశారు.

Telugu Vadivel, Shankar, Gentleman, Nagma, Prabhudeva, Premikudu, Kunjumon-Lates

శంకర్‌ టేకింగ్‌, ప్రభుదేవా నటన, డ్యాన్స్‌లు, నగ్మా అందాలు, పాటల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి.ఒక కథని నమ్మి ఆ పాత్రకి ప్రభుదేవానే సరిపోతాడని ప్రొడ్యూసర్ కుంజుమన్ చివరివరకు సినిమాని నడిపించి సూపర్ హిట్ చేసారు.సో, ఒక సినిమా హిట్టయిన ఫట్టయినా అది అందరి చేతుల్లో ఉంటుంది ఒక్క డైరెక్టర్ చేతిలోనే కాదు.

అందుకే ఈ సినిమాకి నాలుగు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఉన్ని కృష్ణన్‌, ఉత్తమ ఎడిటింగ్‌ బి లెనిన్‌, వీటీ విజయన్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ వెంకీ, ఏఎస్‌ లక్ష్మీనారాయణ, మూర్తిలకు ఆడియోగ్రఫీలో అవార్డులు దక్కాయి.

అదండీ ప్రేముకుడి సినిమా వెనకాల జరిగిన కథ! ఒకవేళ మీరు ఈ సినిమా చూసి చాలారోజులైతే వెంటనే ఈ సినిమా చూడండి.ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని సినిమా “ప్రేమికుడు”

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube