సంబురాల‌కు వైసీపీ దూరం.. జ‌గ‌న్ ప్ర‌శంసాత్మ‌క నిర్ణ‌యం

అఖండ మెజార్టీతో ఏపీ చ‌రిత్ర‌లో ఎవ‌రికీ ద‌క్క‌నంత భారీ విజ‌యాన్ని న‌మోదు చేశారు జ‌గ‌న్‌.

అయితే 151 మంది ఎమ్మెల్యేల‌తో సీఎం కుర్చీలో జ‌గ‌న్ కూర్చుని స‌రిగ్గా రెండున్న‌రేండ్లు గ‌డుస్తున్నాయి.

అయితే స‌గం పాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా పార్టీలో సంబురాలు అనేవి కామ‌న్ క‌దా.ఎందుకంటే జ‌గ‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డి రాజకీయ గండ‌ర గండుడు అయిన చంద్ర‌బాబును ఎదుర్కుని మ‌రీ నిల‌బ‌డ్డారు.

సుదీర్ఘ పాద‌యాత్ర త‌ర్వాత సీఎం అయిన జ‌గ‌న్‌కు ఈ రోజు ఎంతో కీల‌కం అనే చెప్పాలి.పైగా వ‌రుస ఎన్నిక‌ల్లో కూడా జ‌గ‌న్ పార్టీనే గెలుస్తూ వ‌స్తోంది.

ఇక చంద్రబాబు లాంటి న‌ల‌భై ఏండ్ల అనుభం ఉన్న నేత‌ను జ‌గ‌న్ స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నారంటేనే ఇది వైసీపీకి ఎంత హ్యాపీ మూమెంట్ అనేది అంద‌రం అర్థంచేసుకోవ‌చ్చు.అలాంటిది త‌మ ప్రియ‌త‌మ అధినేత జ‌గ‌న్ సీఎం అయి రెండున్న‌రేండ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా అంద‌రూ సంబురాలు చేసుకోవాలి.

Advertisement

కానీ ఎందుకో వారంతా సంబురాల‌కు దూర‌మ‌య్యారు.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం నాలుగు జిల్లాల్లో విప‌రీత‌మైన వ‌ర్షాలు కుర‌వ‌డ‌మే.

విప‌రీత‌మైన వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో పార్టీ ప‌రంగా సంబురాలు చేసుకుంటే బాగుండ‌ద‌ని, ప్ర‌జ‌ల్లోనే ఉంటూ వారికి అండ‌గా నిల‌వాలంటూ జ‌గ‌న్ నిర్ణ‌యించారంట‌.ప్ర‌జలు‌ క‌ష్టాల్లో ఉన్నారు కాబ‌ట్టి వారికి సాయం అందించ‌డమే ఇప్పుడు అత్యంత ముఖ్య‌మ‌ని చెప్పారంట జ‌గ‌న్‌.అందుకే త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు ఎలాంటి సంబురాల‌కు అయినా దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది.

ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో న‌లుగురు ప్ర‌శంసించే విధంగా నిర్ణ‌యాలు ఉండాల‌ని చెబుతున్నారంట జ‌గ‌న్‌.ప్ర‌శంసాత్మ‌క నిర్ణ‌యం ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ తీసుకువ‌స్తుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.స‌మ‌యానికి త‌గ్గ నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అవుతున్నార‌నే చెప్పాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు