మనం తినే తిండి వలన కావచ్చు, లేక పాటిస్తున్న లైఫ్ స్టయిల్ వలన కావచ్చు.ముఖం మీద ముడతలు రావడానికి మరి ఎక్కువ వయసు అవసరం పడట్లేదు.30లు దాటగానే ముఖం మారిపోతోంది .ఉన్న వయసుకి ఏడెనిమిది ఏళ్ళు పెద్దగా కనబడుతారు కొందరు మనుషులు.అలాంటి వారికోసమే, చర్మం యవ్వనంగా కనబడటానికి, ముడతలు పోవడానికి ఏం చేయాలో చెబుతున్నాం చూడండి.
* యోగ్ రట్ స్కిన్ ఏజింగ్ నేమ్మదించేలా చేస్తుంది.అరకప్పు యొగ్ రట్ తీసుకొని ముఖం మీద డైరెక్ట్ గా పెట్టుకోండి.దాన్ని అరగంట పాటు అలానే ఉంచేసుకొని ఆ తరువాత చన్నిటితో ముఖాన్ని కడుక్కోండి.
ఇలా రోజు చేయండి.మీ చర్మం కోమలంగా, నునుపుగా తయారయ్యి, ముడతలు పోతాయి.
* ఆలివ్ ఆయిల్ తేనే .ఈ మిశ్రమం కూడా ముడుతల మీద పనిచేస్తుంది.అలాగే ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.సమపాళ్ళలో ఆలివ్ ఆయిల్, తేనే తీసుకొని, ముఖానికి బాగా పట్టండి.ఓ ఇరవై నిమిషాలపాటు దాన్ని అలాగే ఉంచేసుకొని ఆ తరువాత కడగండి.ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.
* పాపయలో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ.ఇది కూడా చర్మం మీద వయసు కనబడకుండా చేస్తుంది.
ఒక పాపాయ తీసుకొని దాన్ని ముక్కులుగా కట్ చేయండి.వాటిని బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోండి.
ఆ పేస్ట్ నే రోజు ఫేస్ మాస్క్ లా వాడుకోండి.రోజు ఇరవై నిమిషాలపాటు ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి.
* రోజ్ వాటర్ మరియు నిమ్మరసం మిశ్రమం కూడా ముడుతలపై పనిచేస్తుంది.రెండుస్పూనుల రోజ్ వాటర్ తీసుకుంటే దాంట్లోకి ఒక స్పూను నిమ్మరసం తీసుకోండి.
ఇలా రోజ్ వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే, దాంట్లోకి సగం నిమ్మరసం తీసుకోండి.ఈ మిశ్రమాన్ని రోజు కాటన్ బాల్ సహాయంతో రోజు నిద్రకి ముందు ముఖానికి పడుతూ ఉండండి.
ఇలా రోజు చేస్తే మీరు వయసు కన్నా తక్కువే కనబడతారు.
* ఆపిల్ సీడెడ్ వెనిగర్ మన చర్మం యొక్క పీహెచ్ బ్యాలెన్స్ ని మెయింటేన్ చేయగలదు.
మీరు చేయాల్సిందల్లా దీన్ని సరిగా ఉపయోగించుకోవడమే.ఒక స్ప్రే బాటిల్ లో వెనిగర్ ని పోసుకొని, రోజు ముఖానికి స్ప్రే చేస్తూ ఉండండి.
కొద్దిరోజుల్లోనే మీకు కావాల్సిన మార్పు కనబడుతుంది.
* మెంతులు కూడా కాంతివంతమైన, యవ్వన చర్మాన్ని ఇవ్వగలవు తెలుసా.
మెంతులని బాగా గ్రైండ్ చేసి, పేస్ట్ లాగా చేసుకొని, రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి పడుతూ ఉండండి.తెల్లారి చన్నీళ్ళు లేదా గోరువెచ్చని నీటిలో ముఖాన్ని కడిగేసుకోండి.
దీన్ని అలవాటుగా మార్చుకుంటే మీరు యంగ్ గా కనిపించడం ఖాయం.