చలికాలం రానే వచ్చింది.రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది.
ఈ సీజన్ లో దాదాపు ప్రతి ఒక్కరి ఇమ్యూనిటీ సిస్టం వీక్ అయిపోతుంది.దాంతో సీజనల్ వ్యాధులు చుట్టుముట్టేసి ముప్ప తిప్పలు పెడుతుంటాయి.
ముఖ్యంగా జలుబు, దగ్గు అనేవి తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.వీటి వల్ల జ్వరం కూడా వచ్చేస్తుంది.
దాంతో ఈ సమస్యల నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే కేవలం రెండంటే రెండు రోజుల్లోనే జలుబు, దగ్గు సమస్యలు పరార్ అవుతాయి.
మరి ఇంతకీ ఈ పవర్ ఫుల్ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందు అంగుళం అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.
అలాగే ఒక నిమ్మ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత పచ్చి పసుపు కొమ్మును తీసుకుని పీల్ తొలగించే సన్నగా తురుముకోవాలి.
ఇక చివరిగా తెల్ల పసుపు కొమ్మును కూడా తీసుకుని సన్నగా తురుముకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లో అల్లం తురుము, పచ్చి పసుపు కొమ్ము తురుము, తెల్ల పసుపు కొమ్ము తురుము, కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి.

ఆ తర్వాత అందులో ఒక గ్లాస్ మరిగించిన వాటర్ ను పోసి బాగా మిక్స్ చేసి ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి.అనంతరం వాటర్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే జలుబు, దగ్గు సమస్యలను తరిమికొట్టే డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ డ్రింక్ రోజుకు ఒకసారి తీసుకుంటే ఎంతటి జలుబు, దగ్గు అయినా రెండు రోజుల్లో తగ్గు ముఖం పడతాయి.అదే సమయంలో రోగనిరోధక వ్యవస్థ సైతం స్ట్రోంగ్ గా మారుతుంది.
దాంతో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.