వామ్మో.. ఆదిపురుష్ కుంభకర్ణుడు ఒక్కరోజులో ఏకంగా అంత ఫుడ్ తింటాడా?

టాలీవుడ్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్.( Adipurush ) ఇటీవల విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.ఈ సినిమాలోని పాత్రల లుక్ అభిమానులకు అంతగా నచ్చకపోవడమే కాకుండా సినిమాలోని డైలాగ్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి.క్రిటిక్స్ ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు.ఇకపోతే ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో లవి పజ్నీ నటించిన విషయం తెలిసిందే.

 Adipurush Kumbhakarna Actor Lavi Pajni Weight 140kg And He Eats 20 Rotis 25 Eggs-TeluguStop.com
Telugu Adipurush, Kumbhakarna, Lavi Pajni, Prabhas, Tollywood-Movie

చాలామంది సినిమాలో అతని నటనను చూసి ఆ పాత్రకు అతను బాగా సెట్ అయ్యాడు అంటూ కూడా ప్రశంసలు కురిపించారు.ఇక అతను ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.లవి పజ్ని పంజాబ్‌లోని పాటియాలా నివాసి.ఇతను SS తీసిన 2017 బ్లాక్ బస్టర్ బాహుబలి 2 ది కన్‌క్లూజన్‌తో సినీ అరంగేట్రం చేశాడు.అందులో ఇతను కాలకేయ సర్దార్ పాత్రను పోషించాడు.ఆ తర్వాత 2021లో మోసగాళ్లు, రాధే చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు.

ఆదిపురుష్‌లో కుంభకర్ణుడి పాత్రను పోషించడానికి భారీ శరీరం కారణంగా ఈ నటుడిని ఎంచుకున్నారు.

Telugu Adipurush, Kumbhakarna, Lavi Pajni, Prabhas, Tollywood-Movie

ఇతని ఎత్తు 6 అడుగుల 10 అంగుళాలు.బరువు 140 కేజీలు.అయితే ఈ సినిమాలో కర్ణుడి పాత్ర కోసం తాను ఎంత కష్టపడ్డాను అన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ సందర్భంగా లవి పజ్ని ( lavi pajni )మాట్లాడుతూ కుంభకర్ణ పాత్ర కోసం తాను 6-7 కేజీల బరువు పెరిగానని తెలిపాడు.ప్రతిరోజూ 20 చపాతీలు, 25 గుడ్లు, 1 కేజీ చికెన్ తినేవాడినని తెలిపాడు.అలాగే రోజూ 1.5 లీటర్ల పాలు తాగానని వివరించాడు.అలాగే ఆదిపురుష్‌లో డైలాగ్స్ గురించి పజ్నీ ఓపెన్‌గానే తన అభిప్రాయాలు చెప్పాడు.కాగా అతని డైలీ ఎంత ఫుడ్ తీసుకుంటాడు అన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube