టిక్ టాక్ వీడియోల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.దీని ద్వారా చాలా మంది తమలో దాగి ఉన్న యాక్టింగ్ టాలెంట్ ను, కామెడీ టాలెంట్ ను బయటపెట్టారు.
ఈ యాప్ ద్వారా చాలా మంది ఫేమస్ కూడా అయ్యారు.అంతేకాదు ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు.
వాస్తవానికి ఇలా యాక్టింగ్ చేసి ఆకట్టుకోవడం కూడా ఒక రకమైన ప్రతిభ.అయితే ఇలా టిక్ టాక్ వీడియోలు చేయడానికి కూడా కాలేజీల్లో కోర్సు ఉందని మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.అమెరికాలోని ఓ యూనివర్సిటీ ఇలాంటి ‘విచిత్రమైన’ కోర్సును ప్రారంభించింది.
ఈ యూనివర్సిటీలో వీడియోలు చేయడం, డబ్బు సంపాదించడానికి శిక్షణ కూడా ఇస్తారు.
ఈ కొత్త కోర్సుకు ‘బిల్డింగ్ గ్లోబల్ ఆడియన్స్’ అని పేరు ఉంది.
మన భాషలో అయితే దీనిని టిక్‌టాక్ క్లాసులు అని పిలుస్తారు.ఈ కొత్త కోర్సు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం తయారుచేయడం జరిగింది.
ఈ కోర్సు ద్వారా మీరు సోషల్ మీడియాలో మీ ఫాలోయింగ్ ని ఎలా పెంచుకోవచ్చో చెబుతారు.నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ ఆఫ్ డర్హామ్ ఈ ప్రత్యేక కోర్సును ప్రారంభించింది.
ఈ కోర్సులో ఒక వీడియోని ఎలా చేయాలి.దానిని పోస్ట్ చేయడం ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలి.
ఆ వీడియోల ద్వారా మన పర్సనల్ ఇమేజ్ ని ఎలా పెంచుకోవాలి తదితర విషయాలని ఈ కోర్సులో బోధిస్తారు.
ఈ ఇన్‌స్టిట్యూట్లో ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ప్రొఫెసర్ ఆరోన్ డినిన్ ఈ శిక్షణ ఇస్తారు.విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆయనే స్వయంగా ఈ కోర్సును ప్రారంభించడం విశేషం.ఈ కోర్సుకి మంచి స్పందన వస్తోంది.ఈ కోర్సు చేస్తున్న విద్యార్థులందరు కలిసి టిక్‌టాక్‌లో 1.5 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.దీంతో పాటు వారు చేసే వీడియోలకు 80 మిలియన్లకు పైగా అంటే 8 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.