ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.అంగరంగ వైభవంగా, కోలాహలంగా వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతుంది.
పెళ్లిళ్లలో నెలకొన్న కోలాహలం.అక్కడి జరిగే సందడి వీడియోలు సర్వసాధారణంగా అందరినీ ఆకర్షిస్తుంటాయి.
సరదాగా డ్యాన్స్ లు చేస్తున్న ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి.అలాంటి ఫన్నీ వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇది చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు.ఈ వీడియో నిశ్చితార్థానికి సంబంధించినది.
ఇందులో అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు ఉంగరాలు ధరించారు.
కొంతమంది స్త్రీలు నిశ్చితార్థం మరియు పెళ్లిళ్ల సమయంలో ఆశీర్వాదం కోసం తమ భర్తల పాదాలను తాకడం మీరు చూసి ఉంటారు.
ఈ వైరల్ వీడియోలో కూడా అలాంటి సన్నివేశమే ఒకటి కనిపిస్తుంది.కానీ ఆ తర్వాత ఇక్క భిన్నంగా జరుగుతుంది.నిశ్చితార్థం సమయంలో అబ్బాయి, అమ్మాయి ఎదురుదురుగా నిల్చుని ఉంటారు.వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వారి పక్కన నిలబడి ఉండటం వీడియోలో మీరు చూడవచ్చు.
ఇప్పుడు ఒకరికొకరు ఉంగరాలు ధరించే టైం వచ్చింది.
మొదట, అమ్మాయి తన కాబోయే భర్తకు ఉంగరాన్ని వేలికి తొడుగుతుంది.
ఆ తర్వాత అబ్బాయి పాదాలకు నమస్కరిస్తుంది.దీని తరువాత, అబ్బాయి కూడా అమ్మాయికి ఉంగరాన్ని పెట్టాడు.
అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్.అమ్మాయి ఏ విధంగా తన కాళ్ళను తాకిందో.
అదే విధంగా అబ్బాయి కూడా అమ్మాయి పాదాలను తాకడానికి నేల మీదకు వంగాడు.ఇది చూసి అమ్మాయి నవ్వుతుంది.
సాధారణంగా ఇలాంటి తమాషా దృశ్యం చాలా అరుదుగా చోటు చేసుకుంది.ఇంకా చెప్పాలంటే.
ఇలాంటి సన్నివేశాలు.పవిత్ర బంధం వంటి సినిమాలో మాత్రమే చూస్తాం.
దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.పాపం అమాయక బాలుడు అంటూ ఒకరు కామెంట్ చేస్తుండగా.
అమ్మాయి కాళ్లకు నమస్కరిస్తే తప్పేంటని మరొకరు కామెంట్ చేస్తున్నారు.