ప్రస్తుత సమాజంలో చాలా చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు దాదాపు చాలామంది ప్రజలు గుండెపోటు( Heart attack ) భయంతో బాధపడుతున్నారు.ఈ పదార్థాన్ని రోజు తినడం వల్ల గుండెపోటు సమస్య గురించి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే మీ జీవనశైలిలో సాధారణ మార్పులు చేసుకోవాలి.ఈ రోజు నుంచి మీరు ప్రతి రోజు ఈ పదార్థాన్ని తప్పకుండా తినాలి.
మరి ఆ పదార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే వేయించిన శనగలు( Roasted chickpeas ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
చాలా మంది శనగలను నానబెట్టి మొలకల రూపంలో అనేక ఇతర మార్గాలలో తింటూ ఉంటారు.

మన పూర్వీకులు కొన్నేళ్లుగా బెల్లం శనగలు తింటూ హాయిగా జీవించారు.ఈ సమయంలో గుండె జబ్బులు( Heart attack ) చాలా అరుదుగా వచ్చేవి. ఆయుర్వేదం( Ayurveda )లో కూడా దీని ప్రస్తావన ఉంది.
పెద్దపెద్ద వైద్యులు కూడా దీన్ని అనుసరిస్తూ ఉన్నారు.గుర్రం పప్పును తింటుంది.
కాబట్టి ఇది చాలా శక్తిని కలిగి ఉంటుంది.అదే విధంగా మీరు క్రమం తప్పకుండా వేయించిన శనగలను తింటే మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అలాగే వేయించిన శనగలు బరువు తగ్గడానికి చాలా ప్రభావంతంగా పని చేస్తాయి.దీన్ని బరువు తగ్గించే ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వేయించిన శనగలు తినడం వల్ల మీకు ఎక్కువ సమయం వరకు ఆకలి వేయదు.దీంతో పాటు మీ తిండి అదుపులో ఉంటుంది.దీని వల్ల మీరు బరువు కూడా తగ్గుతారు.( Weight Loss )దీంతో పాటు వేయించిన శనగలు కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఈ శనగలలో ఉండే రాగి, మాంగనీస్, మెగ్నీషియం రక్తం నాళాలను రిలాక్స్ చేస్తాయి.దీని కారణంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
అలాగే ప్రతి రోజు వేయించిన శనగలు తినడం వల్ల మీ గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.కాల్చిన శనగలలో ఉండే మాంగనీస్, పాస్పరస్, ఫోలేట్, కాపర్ రక్తప్రసరణను నిర్వహిస్తాయి.
దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.