దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలుసు కదా.ఓ సీఎం హోదాలో అసెంబ్లీ సాక్షిగా ఎన్‌కౌంటర్‌ను సమర్థించడమేంటని కొందరంటే.
జగన్ మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు.అయితే ఈ ఎన్‌కౌంటర్‌ను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ అని జగన్ చెప్పడం కూడా చర్చనీయాంశమైంది.?
ఆరు నెలల్లోనే ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందనుకున్న సమయంలో జగన్ ఇలా పొగిడారేంటి అని విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు.దీనిపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూశారు.
ఇప్పుడిదే విషయాన్ని తన కొత్త పలుకు ద్వారా బయటపెట్టారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.తనపై ప్రశంసలు కురిపించినా.
జగన్ విషయంలో మాత్రం కేసీఆర్ గుర్రుగానే ఉన్నట్లు ఆయన తేల్చేశారు.

ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని ఉమ్మడి ప్రాజెక్ట్‌గా చేపడదామని తనతో చెప్పి ఇప్పుడు జగన్ ఒక్కడే ముందుకు వెళ్లడంపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో జగన్‌ను ఉద్దేశించి తన సన్నిహితుల దగ్గర ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఆర్కే వెల్లడించారు.ఎన్నికల్లో ఎంతో సాయం చేశాను.
అయినా జగన్ ఇలా చేస్తారా.అనుభవిస్తాడు అని కేసీఆర్ అన్నట్లు రాధాకృష్ణ చెప్పడం గమనార్హం.
ఈ ఉమ్మడి ప్రాజెక్టే కాదు.కేంద్రంతో సంబంధాలపైనా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం.బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కేసీఆర్ సిద్ధంగా ఉంటే.జగన్ మాత్రం తనపై ఉన్న కేసుల దృష్ట్యా ఆ సాహసం చేయలేకపోతున్నారు.
ఇక ఏపీలో జగన్ అమలు చేస్తున్న కొన్ని పథకాలు కూడా కేసీఆర్‌కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.దీంతో ఆయనకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.