ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి.150 రూపాయల వరకు కూడా ఉల్లి ధరలు పలుకుతున్నాయి అంటే ఏ స్థాయిలో ఉల్లి రేట్లు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సాదారణ సమయంలో ఉల్లి గడ్డలకు 15 నుండి 25 రూపాయలు మాత్రమే ఉంటుంది.కాని ఇప్పుడు పది రెట్లు పెరిగి 150 రూపాయలకు చేరడంతో జనాలు నానా గోల చేస్తున్నారు.
వినియోగదారులు వామ్మో వాయ్యో అనుకుంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా మీమ్స్ చేస్తూ ఉన్నారు.ఉల్లి గడ్డల రేట్లు పెరగడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసిన ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
రైతు మాట్లాడుతూ.ఉల్లి ధర 15 నుండి 25 రూపాయలు ఉన్నప్పుడు మా వద్ద కేవలం 5 లేదా 6 రూపాయలకు కొనుగోలు చేసేవారు.10 రూపాయలు ధర ఉల్లికి పడింది అంటే మేము చాలా సంతోషించే వాళ్లం.అయిదు రూపాయలు ఉల్లికి ధర పలికితే రైతుకు పెట్టుబడి కూడా వచ్చేది కాదు.
అలా ఎన్నో సార్లు నష్టపోయాం.అయినా కూడా వ్యవసాయం కాకుండా మరేం చేయలేక ఉల్లి గడ్డలనే పండిస్తూ వస్తున్నాం.
ఉల్లి గడ్డలపై ఇప్పటి వరకు ఏడాదికి యకరాకు 5 వేలు లాభం వచ్చింది అంటే చాలా గొప్ప విషయం.ఆ లాభం ఏమో కాని చాలా సార్లు నష్ట పోయాం.
అలాంటిది ఇప్పుడు కాస్త లాభం వస్తుంది.మీ వద్దకు 100 నుండి 150 రూపాయలకు వస్తున్న ఉల్లి గడ్డలను వ్యాపారస్తులు మా వద్ద కేవలం 45 నుండి 60 రూపాయల మద్య కొనుగోలు చేస్తున్నారు.

ఇక్కడ కూడా రైతులకు పెద్దగా వస్తున్నది ఏమీలేదు.ఈసారి వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టినా తక్కువ పంట వచ్చింది.ఇంత రేటు ఉన్నా కూడా రైతుకు ఎవకరాకు 10 నుండి 15 వేల వరకు లాభం వస్తుందే లేదో తెలియదు.అయినా కూడా మీరు మాత్రం రైతులపై పడి ఏడుస్తున్నారు.
రైతులు కాస్త లాభం చూస్తే మీకు కళ్ల మంట మండుతున్నాయా.ఈసారి ఇలా ఉంటుంది.
మళ్లీ వచ్చే యేడాది మళ్లీ నష్టాలే కదా అంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ రైతు ఆవేదన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.