మాస్ లీడర్ ఎన్టీరామారావు మనవడు… అపర చాణక్యుడు చంద్రబాబు కొడుకు.ఇవన్ని కలిపి అసలు లోకేష్ బాబు ఏ స్థాయిలో ఉండాలి.
ప్రజలకు దగ్గరగా ఉంటూనే తన రాజకీయ చతురతతో ఆకట్టుకుని తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం నింపాలి.అధికారం పక్షానికి కూడా లోకేష్ కౌంటర్స్ ఇస్తూ.
విషయ పరిజ్ఞానంతో.అవగాహనతో సూటిగా ప్రశ్నించి చెమటలు పట్టేలా చేయాలి.
చంద్రబాబు కొడుకుగా ఫైర్ బ్రాండ్ గా .మాస్ లీడర్ గా ఎదగాల్సింది.కానీ ఇవన్ని మనం ఎప్పుడు చూస్తామో.
లోకేష్ బాబు ఎక్కువగా సోషల్ మీడియాలోనే మాట్లాడతారని.
సూటిగా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఈ యువనాయకుడిలో లేవని.ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడని వైసీపీ నేతలు అనే మాట.
ఎప్పుడు చూడూ.వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకుని వార్తల్లో నిలుస్తారే తప్పా.
ఓ ప్రధాన సమస్య తీసుకుని దానిపై పోరాడి గెలిచే సత్తా లేదా.అనిపించే పరిస్థితి ఏర్పడింది.
ట్విట్టర్ వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు.అన్నట్లు ఎంతసేపు ట్విట్టర్లోనే పోరాటం చేస్తాడనే విమర్శ కూడా ఉంది.
లోకేష్ అపర చాణక్యుడు చంద్రబాబు కొడుకే కదా.మరి ఆ జ్ఞానం ఎటుపోయింది.
ఆ రాజకీయ చతురత ఎందుకు అబ్బలేదు… ఇలా చాలా డౌట్లు చాలా మందికే ఉన్నాయి.

అసలు లోకేష్ బాబు ఏం సాధించాలనుకుంటున్నాడు.బాబు ఉన్నాడు.మనం తోడునీడగా ఉంటే సరిపోతుందనుకుంటున్నాడా.
ఏపీ రాజకీయాల్లో ఓ ఊపు తేలేడా.ఈ యువనాయకుడు ఇప్పటికే ఎంతో మంది టీడీపీ కార్యక్తరలకు రోల్ మోడల్ గా ఉండాల్సింది.
మాస్ లీడర్ గా ఎదిగి తాతకి తగ్గ మనవడిగా.తండ్రికి తగ్గ కొడుకుగా ఎప్పుడో అనిపించుకోవాల్సిది.
వైసీపీ అధ్యక్షడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తండ్రి బాటలో యువనాయకుడిగా ఎలా దూసుకెళ్తున్నారు.అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
ఇలా ఇవన్నీ లోకేష్ కు పట్టవా.ఆ మార్పు లోకేష్ బాబులో చూడలేమా.
ఎంత సేపు పప్పు.ముద్దపప్పు అనిపించుకోవడమేనా.
పంతం మార్చి తిరగబడలేరా.పసలేని పాదయాత్రలతో సమయం వృథా చేయడం ఎందుకు.
సరైన పాయింట్ పట్టుకుని అధికార పార్టీకి చెమటలు పట్టేలా చేయాలి.నిత్యం ప్రజల్లో ఉంటూ అడుగడుగునా ప్రశ్నిస్తూ.ముందుకు వెళ్లాలి.చిన బాబుకు ఎగ్జామ్ పేపర్ లీక్ సమస్య తప్పా మరే సమస్యలు కనబడటం లేదా.
రొటీన్ సమస్యలు కాకుండా అధికార పార్టీ లొసుగులు తెలుసుకుని వాటి పని పట్టలేరా.మంచి సబ్జెక్ట్ ఎంచుకుని సరైన విషయ పరిజ్ఞానంతో మాట్లాడి నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి.
ఇవన్నీ బాబే చూసుకోవాలా.ఇంకెన్నాళ్లు చినబాబు వెనకాలే ఉంటారు.
మరో అడుగు ముందుకేసి ప్రజాసమస్యలపై పోరాడలని.ఇప్పుడు చేస్తున్న కృషి సరిపోదని అంటున్నారు అంతా .