తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలక పరిణామాలతో హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మూడో సారి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో కెసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఉన్న అన్ని అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది.
అయితే రానున్న రోజుల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఒక ప్రచారం జరుగుతుండటం, అంతేకాక ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నట్టు కొంత సర్వేల ద్వారా వెల్లడవటంతో పార్టీలు ఇక వ్యతిరేక ప్రచారాన్ని మరింత పెంచడంపై దృష్టి సారించిన పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ తన రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నా అధికారంలో ఉన్నప్పుడు ఎదుర్కోలేదు కాబట్టి ఈ పరిస్థితులను ఎలా కెసీఆర్ ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారిన పరిస్థితి ఉంది.
అయితే ఇటు పార్టీలన్నీ వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని సిద్దమవుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశం.

ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కాకున్నా అందరి టార్గెట్ కెసీఆర్ కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో కీలక పరిణామాలు చోటు చేసుకొని టీఆర్ఎస్ కు అనుకూలంగా పరిస్థితులు మారితే ఇక కెసీఆర్ గెలుపును ఎవరూ ఆపలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వ పధకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత లేకపోగా కొంత సానుకూల దృక్పధం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వృద్దాప్య పింఛన్ అనేది కెసీఆర్ రెండో సారి గెలుపొందడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పవచ్చు.
అయితే ఎన్నికల సమయం దగ్గర పడ్డప్పుడు ఇక మరిన్ని ప్రజాకర్షక పధకాలను, నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.మరి అప్పుడు ఇటు ప్రతిపక్షాలు విజయం సాధిస్తాయో, కెసీఆర్ విజయం సాధిస్తారో అనేది మనకు తెలిసే అవకాశం ఉంది.







