ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్.కె.రోజా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులను కలుస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని ఆమె కుటుంబంతో సహా ఇంటికి వెళ్లి కలిసి ఆశీస్సులు పొందారు.
అలాగే కేసీఆర్ , కేటీఆర్ ను కలిశారు.ఇక ఏపీ సీఎం జగన్ తల్లి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్ విజయలక్ష్మి తోనూ రోజా సమావేశం అయ్యారు.మంత్రి పదవి ఇచ్చినందుకు ఆమె ఆశీర్వాదాలను రోజా తీసుకున్నారు.ఈ వ్యవహారంపై ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోంది.ఇటీవల మంత్రి పదవులు పొందిన వారు ఎవరు విజయమ్మతో భేటీ అయ్యేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
చాలా కాలంగా వైసీపీలో విజయమ్మ పేరు ఎవరు ప్రస్తావించడం లేదు.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి.తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టారు.
జగన్ తో విభేదించే ఆమె పార్టీ పెట్టినట్లుగా ప్రచారం జరిగింది.అలాగే అనేక అంశాలలో విజయమ్మ షర్మిల, జగన్ తో విభేదించారు అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షరాలు పదవికి రాజీనామా చేయబోతున్నారనే చర్చ చాలాకాలం నుంచి జరుగుతోంది.దీనిపై ఎంతగా ప్రచారం జరుగుతున్నా.
ఎక్కడా జగన్ కానీ , వైసీపీ నాయకులు కానీ స్పందించడం లేదు.కానీ ఇప్పుడు రోజా తనకు మంత్రి పదవి లభించినందుకు ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్ళడం తో ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

వైఎస్ షర్మిల నివాసం ఉండే లోటస్ పాండ్ లోనే రోజా విజయలక్ష్మి ని కలిశారు.దాదాపు గంట పాటు వీరి భేటీ జరిగింది.ఈ సందర్భంగా ఏపీ తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల పైన వీరి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అలాగే షర్మిల పాదయాత్ర, రాజకీయ పార్టీ గురించిన చర్చ జరిగిందట.
ప్రస్తుతం ఈ వ్యవహారం పై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తి రేపుతోంది.ఖచ్చితంగా జగన్ ఆగ్రహానికి రోజా గురవుతారని గతంలో ఉన్న ప్రాధాన్యాన్ని ఆమె కోల్పోతారనే ప్రచారం జరుగుతోంది.