తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలోని బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏ( ITDA ) నిర్వీర్యమైందన్నారు.
ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం ఐటీడీఏకు పూర్వ వైభవం తీసుకువస్తుందని తెలిపారు.డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు.
గిరిజన రైతులకు ఎలాంటి ఆటంకాలు కలిగించ వద్దని పేర్కొన్నారు.గిరిజన రైతుల సాగు కోసం త్వరలోనే ఇందిరా జలప్రభ పథకాన్ని( Indira Jalaprabha scheme ) ప్రారంభిస్తామని తెలిపారు.అలాగే అడవుల పెంపకంలో గిరిజన రైతులను భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు.