ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సౌత్ ఇండస్ట్రీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.సౌత్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలపై బాలీవుడ్ నటీనటులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సౌత్ సినిమాలపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సౌత్ ఇండియన్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపగా మరికొందరు ఏకంగా సౌత్ సినిమాల్లో నటించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార,మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రస్తుతం సౌత్ సినిమాల్లో నటించడానికి ఎంతో కుతూహలంతో చూపుతున్నారు.
గతంలో తమిళ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్యరాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా సౌత్ ఇండస్ట్రీతోనే ప్రారంభించాలని భావిస్తున్నారట.ఈ క్రమంలోనే గతంలో రజనీకాంత్ తో కలిసి రోబో సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న ఐశ్వర్య మరోసారీ రజనీకాంత్ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ మెయిన్ ఫిమేల్ లీడ్ లో నటించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే దీపికా పదుకొనే, అలియా భట్ వంటి బాలీవుడ్ తారలు సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుండగా వీరి బాటలోనే నటి ఐశ్వర్యరాయ్ కూడా సౌత్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.







