అగ్ర రాజ్యం అమెరికాలో మన తెలుగు వారికి కొదవే లేదు.అమెరికాలో ఏ రాష్ట్రంలోనైనా సరే తెలుగు వారు కొలువుదీరి ఉంటారు.
తెలుగు వారు ఉండే ప్రాంతాలకు తగ్గట్టుగా అక్కడ పలు సేవా సంస్థలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే తెలుగు వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు.ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు సంస్థలుగా పేరొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ట్రి స్టేట్ తెలుగు అసోసియేషన్ (TTA) లు సంయుక్తంగా చెస్ పోటీలను నిర్వహిస్తున్నాయి.
ప్రతీ ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చెస్ పోటీలను ఈ ఏడాది కూడా సాంప్రదాయ బద్దంగా, తెలుగు వారి పిల్లల కోసం నిర్వహిస్తున్నట్టుగా చికాగో లో TANA, TTA సంస్థలు ప్రకటించాయి.పిల్లలో దాగున్న నైపుణ్యం, ఆలోచనా శక్తిని మరింత మెరుగు పరిచేలా చేయడానికి ప్రతీ ఏటా ఈ చెస్ పోటీలను రెండు సంస్థలు కలిసి నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీ ప్రపంచంలో పిల్లలలో ఆలోచనా శక్తి పెరగాలని ఏకాగ్రతను పెంచేలా , నిర్ణయాత్మక శక్తిని పెంపొందించేలా చేయగల శక్తి చెస్ ఆటలకు ఉంటుందని, ఈ పోటీలకు పిల్లలను తల్లి తండ్రులు సిద్దం చేయడం ఎంతో సంతోషకరమైన తానా, TTA సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో TTA అధ్యక్షులు వీరపల్లి హేమ చంద్ర పాల్గొని పోటీల నిర్వహణ పర్యవేక్షించారు.TTA ఇతర సభ్యులు ఈ పోటీలకు సహాయ సహకారాలు అందించగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి వర్చువల్ గా పోటీలో పాల్గొన్న వారిని అభినందించారు.కాగా ఈ పోటీలు తమ పిల్లలలో నైపుణ్యాన్ని, స్వ ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తెలిపారు కాగా TANA, TTA సభ్యులకు పిల్లల తల్లి తండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.