యోగా మన దేశ సంపద అయినా, చేయడానికి అలసత్వం ప్రదర్శిస్తాం.కాని మన యోగా అంటే యూరప్, వెస్ట్రన్ కంట్రీస్ కి, ఆస్ట్రేలియా లాంటి దేశాలకి చాలా ఇష్టం.
యోగా సెంటర్లు పెద్ద మొత్తంలో దర్శనమిస్తాయి బయటిదేశాల్లో.హాలీవుడ్ నటులు కూడా యోగా చేస్తారు .కోట్లమంది ఆరాధించే నటి ఎమ్మా వాట్సన్ ఒక యోగా టీచర్ కూడా.ఇదంతా మళ్ళీ ఎందుకు అంటే, ఫారెన్ లో యోగాకి ఇచ్చే ప్రాముఖ్యతను చెప్పడానికి.
ఊరికే యోగా చేయటం బోర్ కొట్టిందేమో.బోర్ ని తగ్గించడానికి బీర్ వాడుతున్నారు పరిదేశీయులు.అర్థం కాలేదా? బీర్ తాగి యోగా చేయడం అనే కొత్త పద్ధతి ఆమధ్య జర్మనిలో మొదలైంది.ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ వింత అమెరికా, ఆస్ట్రేలియాకి కూడా పాకింది.
ఇదో కొత్త ట్రెండ్ లేండి.
తమ యోగా సెంటర్ కి జనాల్ని ఎక్కువగా ఆకర్షితులను చేసేందుకు “Brew House” అనే యోగా సెంటర్ ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది.
ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకునే వారంతా బీర్ తాగి ఆసనాలు వేస్తారు.
ఇలా చేయడం బాగుందని అంటున్నారు కస్టమర్స్.
బీర్ తాగుతూ యోగా చేయడం అని సరికొత్త అనుభూతి అని, కొత్తగా, ఆసక్తిగా అనిపిస్తోందని ఈ బీర్ యోగాకి కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు.