బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ ప్రింట్ ప్రదర్శన.. చరణ్ కు టైం అస్సలు బాలేదా?

రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజెర్ మూవీ( Game changer movie ) తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాకు ఒకవైపు పాజిటివ్ స్పందన వస్తుండగా మరోవైపు నెగటివ్ స్పందన లభిస్తోంది.

 Ram Charan Game Changer Hd Print Leaked And Playing In Private Travel Buses, Ram-TeluguStop.com

భారీ అంచనాల నడుమ థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.

ఇక చాలామంది ఈ సినిమాపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ముఖ్యంగా కొందరు పనిగట్టుకుని కావాలని ట్రోలింగ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక సినిమాను చూస్తూ రకరకాల ఫీట్లు, వీడియోలు, రీల్స్ చేస్తూనే ఉన్నారు.ఇక హెచ్ డీ ప్రింట్‌ను(HD print ) కూడా ఈ యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా వైరల్ చేస్తున్నారు.

రామ్ చరణ్ ( Ram Charan )గేమ్ ఛేంజర్ సినిమా మొదటి రోజే హెచ్ డీ ప్రింట్ లీక్ అయింది.

Telugu Game Changer, Hd Print Leaked, Privatetravel, Ram Charan, Ramcharan-Movie

యాంటీ ఫ్యాన్స్ కావాలనే ఆ హెచ్ డి ప్రింట్‌ను సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ చేశారు.అసలే సినిమాకు బ్యాడ్ టాక్, మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.ఫ్యామిలీ ఆడియెన్స్ కొన్ని చోట్ల బాగుందని అన్నారు.

కానీ నెట్టింట్లో మాత్రం గేమ్ ఛేంజర్‌ కు ఫుల్ నెగెటివ్ చేస్తూ వచ్చారు.ఈ నెగెటివిటీయే సినిమా కొంప ముంచినట్టుగా ఉంది.

దీనికి తోడు సినిమా టీం రిలీజ్ చేసిన కలెక్షన్ పోస్టర్ మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది.కాగా ఈ సినిమాకు వచ్చింది 85 కోట్లు మాత్రమే అయినప్పటికీ వంద కోట్లు ఎక్కువగా వేశారు అంటూ ట్రేడ్ వర్గాలు మండిపడ్డాయి.

Telugu Game Changer, Hd Print Leaked, Privatetravel, Ram Charan, Ramcharan-Movie

బాక్సాఫీస్ కలెక్షన్లు ట్రాక్ చేసే వెబ్ సైట్లన్నీ కూడా ఈ కలెక్షన్లను ఫేక్ అని కొట్టి పారేశాయి.ఇక యాంటీ ఫ్యాన్స్ సైతం తమ తమ హీరోల కలెక్షన్లు కూడా ఫేక్ ఉంటాయని, కానీ అందులో పది, ఇరవై కోట్లు మాత్రమే ఉంటాయని, కానీ మీరు మాత్రం ఏకంగా వంద కోట్లు ఫేక్ చేస్తున్నారు అని ట్రోలింగ్ చేశారు.అయితే ఇవన్నీ చాలవన్నట్టుగా తాజాగా గేమ్ ఛేంజర్ హెచ్ డి ప్రింట్‌ను ట్రావెల్ బస్సుల్లో ప్లే చేస్తున్నారట.అసలే సంక్రాంతి సీజన్ అందరూ సొంతూళ్లకు వెళ్తుంటారు.ఇలాంటి టైంలో ప్రైవేట్ ట్రావెల్‌ వాళ్లు ఇలా గేమ్ ఛేంజర్ ప్రింట్‌ను ప్లే చేస్తున్నారట.ఈ మేరకు నెట్టింట్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమా టీం వీటి మీద చర్యలు తీసుకోకపోతే ఈ పైరసీని అడ్డుకోకపోతే థియేటర్లో వచ్చే ఆ మినిమం కలెక్షన్లు కూడా రాకపోవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube