బాలయ్య వద్దంటే చివరికి మాస్ మహారాజ్ తీసుకున్నాడంటగా... 

తెలుగు సినీ పరిశ్రమలో మాస్ మహారాజ్ రవితేజ గురించి మరియు ఆయనకి టాలీవుడ్ లో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ మధ్యకాలంలో రవితేజ నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

 Ayyappanum Koshiyum, Malayalam Movie, Ravi Teja, Telugu Movie News, Balakrishna,-TeluguStop.com

దీంతో రవితేజ కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.తాజాగా రవితేజకి సంబంధించినటువంటి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

మలయాళంలో మంచి విజయం సాధించినటువంటి “అయ్యప్పనుమ్ కోశియుమ్” అనే చిత్రాన్ని ఓ టాలీవుడ్ అగ్ర దర్శకుడు గత కొద్ది కాలంగా తెలుగు భాషలో రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రంలోని ప్రముఖ పాత్ర కోసం నందమూరి నటసింహం బాలకృష్ణని సంప్రదించగా ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ ఈ చిత్రంలో నటించడానికి నో చెప్పాడట.

దీంతో ఈ చిత్రంలో బాష్ణలకృష్ణ స్థానంలో రవితేజను తీసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు యోచన చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రవితేజ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నటువంటి “క్రాక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిించనున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి దాదాపుగా 80 శాతం చిత్రీకరణ పనులు పూర్తయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube