మామలుగా అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అంటుంటారు.అలా ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో వార్ కి దిగడం అన్నది సహజం.
కానీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) అభిమానులు మాత్రం అందుకు భిన్నంగా తమ అభిమాన హీరో నటిస్తున్న రెండు సినిమాల కోసం రెండుగా చీలిపోయి సోషల్ మీడియాలో వార్ కి దిగడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా ఉన్న విషయం తెలిసిందే.
పవన్ చేతిలో ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.
పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాల షూటింగ్ కి బ్రేక్ పడింది.ఈ మధ్యనే హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల( Hari Hara Veeramallu , OG movies ) షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.ఇప్పటికే హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ కూడా లాక్ చేసారు మూవీ మేకర్స్.
సమ్మర్ సీజన్ లో మార్చి 28న రిలీజ్ కానుంది.మరోవైపు ఓజీ సినిమాని కూడా వేసవి లోనే విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.
ఇదే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మధ్య చీలికకు కారణం అయ్యింది.కొందరు హరి హర వీరమల్లు గొప్ప అని ఇంకొందరు ఓజీ సినిమా గొప్ప అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
హరి హర వీరమల్లు పాన్ ఇండియా సక్సెస్ అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తుండగా, ఇంకొందరు కాదు కాదు ఓజీ సినిమానే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు అభిమానులు మాత్రం ఈ విషయంలో మూవీ మేకర్స్ తీరుని తప్పుబడుతున్నారు.ఒకే హీరో నటిస్తున్న రెండు సినిమాలను పోటాపోటీగా ప్రమోట్ చేస్తూ ఒకేసారి విడుదల చేయడం అవసరమా అని ఫైర్ అవుతున్నారు.హరి హర వీరమల్లు ఎప్పుడో స్టార్ట్ అయింది కాబట్టి ముందుగా ఆ సినిమాని రిలీజ్ చేయాలని.
ఆ తర్వాత ఓజీ సినిమా ప్రమోషన్స్ షురూ చేయాలని కోరుతున్నారు.అలా కాకుండా రెండూ ఒకేసారి చేయడం వల్ల, ఫ్యాన్స్ కి ఏ సినిమాని భుజానికెత్తుకోవాలో అర్థం కాదని, దాని వల్ల రెండు సినిమాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి ఫ్యాన్స్ ఆవేదనను అర్థం చేసుకొని రెండు సినిమాల నిర్మాతలు చర్చించుకొని ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారేమో చూడాలి మరి.