గల్ఫ్ దేశాల్లో భారతీయుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.రోజుకొక ట్రావెల్ ఏజెంట్ మోసం వెలుగులోకి వస్తూనే వుంది.
ఉపాధి చూపుతారనుకుంటే దేశం కానీ దేశంలో నట్టేట ముంచుతున్నారు కేటుగాళ్లు.వీరి కబంద హస్తాల్లో నుంచి తప్పించుకున్న బాధితుల కష్టాలు వింటే ఎవరికైనా కంట కన్నీరు రావాల్సిందే.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని యజమానులు, ట్రావెల్ ఏజెంట్లు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.ఇంకొందరైతే విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయి.
జైల్లో గడుపుతున్నారు.కనీసం వీరి క్షేమ సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియడం లేదు.
తాజాగా పంజాబ్‌కు( Punjab ) చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ మోసం బయటపడింది.పని కోసం వెళ్లిన మహిళను దేశం కానీ దేశంలో అమ్మేసిందో కిలాడీ.
వివరాల్లోకి వెళితే.మహిళల అక్రమ రవాణా, మోసం ఆరోపణలపై అమృత్‌సర్‌కు( Amritsar ) చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్‌పై నకోదర్ సిటీ పోలీసులు( Nakodar City Police ) కేసు నమోదు చేశారు.
నిందితురాలిని అమృత్‌సర్‌లోని ఛోటా రాయా నివాసి ప్రీత్ కౌర్ అలియాస్ పింకీగా గుర్తించారు.ఈ క్రమంలో బిల్గా గ్రామం పట్టి మెహన్నా నివాసి.నకోదర్‌లోని మొహల్లా కమల్‌పురాలో( Mohalla Kamalpura ) నివసిస్తున్న కుల్వీందర్ కుమార్ భార్య సిమ్రిన్‌ను ఏడాది క్రితం ప్రీత్ కౌర్ తనతో పాటు ఒమన్ రావాలని కోరింది.రూ.40,000 జీతం , మంచి జీవితం ఏర్పాటు చేస్తానని మాయ మాటలు చెప్పింది.

ఏప్రిల్ 26న తాను ఒమన్ విమానాశ్రయానికి( Oman Airport ) చేరుకున్నానని.అక్కడ ఒక మహిళ, మరో వ్యక్తి తనను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి పాస్‌పోర్ట్‌ను లాక్కున్నారని బాధితురాలు తెలిపింది.ఆపై తనను ఇంట్లో బందీగా చేసి కనీసం భోజనం కూడా పెట్టలేదని సిమ్రిన్ వాపోయింది.
అదే ఇంట్లో తనతో పాటు మరో 200 మంది భారతీయ మహిళలు వున్నారని.వారిని తీవ్రంగా కొడుతూ , హింసిస్తున్నారని చెప్పింది.వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు సిమ్రిన్ ఫిర్యాదులో తెలిపింది.

ఆ వెంటనే తాను అక్కడి గురుద్వారాకు చేరుకున్నానని.ఆపై రాజ్యసభ సభ్యుడు విక్రమ్ సాహ్నీని( Vikram Sawhney ) కలిశానని సిమ్రిన్ తెలిపింది.ఆయన తనకు పాస్‌పోర్ట్ ఏర్పాటు చేయడంతో పాటు భారత్‌కు వచ్చేందుకు సాయం చేశారని బాధితురాలు చెప్పింది.
అద్భుతమైన జీవితం వుంటుందని చెప్పి, పింకీ తనను ఒమన్‌లో అమ్మేసిందని.ఆమెపై చర్యలు తీసుకోవాలని సిమ్రిన్ కోరింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పింకీపై పలు అభియోగాలు నమోదు చేశారు పోలీసులు.