ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వానలు పడని చోటు ఒకటి ఉందట.అది ఏ ఎడారి ప్రాంతమో, అందుకే వర్షాలు పడట్లేదని అనుకుంటే పొరపాటు పడినట్లే.
ఎందుకంటే, ఈ ప్రాంతంలో ఎటు చూసినా మంచు ఉంటుంది.కానీ ఆకాశం పైనుంచి ఒక్క వర్షపు చుక్క కూడా పడదు.
అంటార్కిటిక ఖండంలోని ఈ కరువు ప్రాంతం ఉంది.ఆ ప్రాంతానికి చుట్టూ నీళ్ళే ఉంటాయి కానీ వాన రాదు.
భూ ప్రపంచంలో దక్షిణ ధ్రువంలో ఉండే అంటార్కిటికా ఖండం కొన్ని కిలోమీటర్ల మేర మంచుతో కప్పబడి ఉంటుంది.ఈ ఖండంలో ఉత్తర దిక్కున సుమారు 4,800 కి.మీ మేర ‘డ్రై వ్యాలీస్’ అనే ప్రాంతాలు ఉన్నాయి.వీటికా పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 20 లక్షల సంవత్సరాల నుంచి వర్షాలు కురవడం లేదట.
దీనికి ‘కాటబాటిక్ విండ్స్’గా పిలిచే గాలులే కారణం.ఈ ప్రాంతానికి చుట్టూ ‘ట్రాన్స్ అట్లాంటిక్’గా పిలిచే పర్వతాలు ఉన్నాయి.
అక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.సో, గాలిలోని తేమ మంచు రూపంలో పర్వతాలపై పడిపోతుంది.
తేమ లేని పొడి గాలులు డ్రై వ్యాలీస్ వైపు పయనిస్తాయి.వాటినే కాటబాటిక్ విండ్స్ అంటారు.
అక్కడ గాలిలో తేమ లేకపోవడంతో వానలు కురవవు.

మరో మాటలో చెప్పాలంటే గురుత్వాకర్షణ శక్తి తేమను క్రిందికి లాగుతుంది.దీనివల్ల లోయలలో తేమ అనేది పడదు.అప్పుడు కొత్తగా ఈ ప్రాంతాల్లో వాన లేదా తేమ అనేది కురవదు.
ఇక్కడ డ్రైవర్స్ అనే కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి కానీ అవి లక్షలు ఏళ్ల కిందట ఏర్పడినవి.ఆ సరస్సుల్లో అప్పటి నీరే అలానే ఉంది.కొత్తగా నీరు యాడ్ అవ్వలేదు.
