జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్నినాని విమర్శలు గుప్పించారు.సీఎం జగన్ పై బురద చల్లడం పనిగా పవన్ పెట్టుకున్నారని ఆరోపించారు.2004 లో వైఎస్ఆర్ సీఎం అయ్యారని తెలిపారు.
1962, 63 లో తెలంగాణ ఉద్యమం జరిగిందన్న మాజీ మంత్రి పేర్ని నాని అప్పుడు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.పవన్ కూడా ఆస్తులు కొంటున్నారన్న ఆయన చంద్రబాబు చెప్పిన పనిని చేస్తున్నానని చెప్పొచ్చు కదా అన్నారు.టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పండన్నారు.టీడీపీ ఇంఛార్జ్ ను పెట్టిన చోట జనసేన ఇంఛార్జ్ ను పెట్టదని పేర్కొన్నారు.జగన్ ను ఆటాడించే సత్తా ఉన్నోడివి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు.
సినిమా గ్లామర్ ను అడ్డం పెట్టుకొని ప్రజలను అమ్మేస్తున్నావన్నారు.వైసీపీ నుంచి ఎవరినీ పార్టీలోకి రానివ్వనని చెప్పాలని, పవన్ నిలకడ లేని రాజకీయాలు కట్టిపెట్టాలని తెలిపారు.