మీకు లోబీపీ సమస్య ఉందా.. అయితే ఇలా చేయండి..!

ముఖ్యంగా చెప్పాలంటే నీరసంగా అనిపించడం, టెన్షన్ పడడం, ఏ పని చేయాలనుకోకపోవడం వంటివన్నీ లోపిపి( Low Blood Pressure ) లక్షణాలే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.అనేక కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

 Do You Have Low Bp Problem But Do This,health , Health Tips, Low Blood Pressur-TeluguStop.com

ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు వెంటనే చెమటలు పట్టడం, కళ్లు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి.అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలను చాలా వరకు దూరం చేసుకోవచ్చు.

ఆ జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారిలో 60/100 mm Hg, మగవారిలో 70/110 mm కంటే తక్కువగా ఉంటే దాన్ని లోబిపి అని అంటారు.

Telugu Beet Root, Coconut, Tips, Pressure-Telugu Health Tips

బీపీ ఈ స్థాయిలో పడిపోతే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే లో బీపీ లక్షణాలను గుర్తించి జీవనశైలి, ఆహారాలు అలవాట్లలో మార్పులు చేసుకుంటే బీపీని సాధారణ స్థితికి తీసుకుని రావచ్చని చెబుతున్నారు.ముందుగా ఖచ్చితంగా ఆహారాన్ని కాస్త సరైన సమయంలో తీసుకోవాలి.ఆహారం విషయంలో నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు.తినాలనిపించకపోయినా కాస్తయినా తినడం ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే నీరు( Water ) కూడా బాగా తాగుతూ ఉండాలి.

Telugu Beet Root, Coconut, Tips, Pressure-Telugu Health Tips

దీని వల్ల శరీరం అలసిపోకుండా ఉంటుంది.పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.ముఖ్యంగా చెప్పాలంటే దానిమ్మ, బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం ఎంతో మంచిది.అలాగే క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

అలాగే కొబ్బరినీళ్లు( Coconut Water ) ఎక్కువగా తాగుతూ ఉండాలి.వీటివల్ల లో బేబీ సమస్య తగ్గిపోతుంది.లోబీపీ ఉన్నవారు సరైన సమయానికి నిద్రపోవాలి.రోజుకు కచ్చితంగా ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవడం వలన శరీరం లో నూతన ఉత్సాహం వస్తుంది.

శరీరం వేడిపడి తరచుగా బీపీ తగ్గుతూ ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.వైద్యునికి చూపించడం ద్వారా శరీరంలో మరి ఏదైనా ఇతర సమస్య ఉందేమో బయటపడే అవకాశం ఉంది.

అందుకోసమే క్రమం తప్పకుండా శరీరంలో ఏదైనా సమస్య వచ్చిన బీపీ తగ్గిపోతూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube